banaganepalli
-
విశాఖపట్నం సౌత్, ఒంగోలు, బనగానపల్లెలో బస్సు యాత్ర
-
ఒకే అభ్యర్థి.. 3 జిల్లా ర్యాంకులు
బనగానపల్లె/ముమ్మిడివరం: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పాతపాడు గ్రామానికి చెందిన బెడదల రాజశేఖర్‌రెడ్డి సచివాలయ పరీక్షల్లో జిల్లా స్థాయిలో మూడు ర్యాంకులు సాధించి సత్తా చాటాడు. కేటగిరీ–2 గ్రూప్–ఏలో 106.75 మార్కులతో జిల్లాలో 8వ ర్యాంకు సాధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కేటగిరీ–2 గ్రూప్ బీలో 109.25 మార్కులతో జిల్లాలో 4వ ర్యాంకు సాధించి.. సర్వేయర్, వీఆర్వో పోస్టులకు ఎంపికయ్యాడు. అలాగే కేటగిరీ–3లో 80 మార్కులతో జిల్లాలో 9వ ర్యాంకు సాధించి వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టుకు ఎంపికయ్యాడు. తాను వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ పోస్టులో చేరనున్నట్లు రాజశేఖర్‌రెడ్డి తెలిపాడు. రాజశేఖర్ 1–10వ తరగతి వరకు మండలంలోని ఇల్లూరుకొత్తపేట గ్రామంలోని పెండేకంటి పబ్లిక్ స్కూల్లో, ఇంటర్ గుంటూరులోని శ్రీచైతన్యలో, బీటెక్ కర్నూలు జి.పుల్లారెడ్డి కళాశాలలో, ఎంటెక్ ఎన్ఐఐ తిరుచ్చిలో చదివాడు. ఇతని తల్లిదండ్రులు బెడదల అచ్చమ్మ, బెడదల నారాయణరెడ్డి వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. ‘తూర్పు’లో సురేష్‌కు ప్రథమ ర్యాంకు: గ్రామ సచివాలయ పరీక్షల్లో మత్స్యశాఖ సహాయకుల ఉద్యోగ విభాగంలో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లికి చెందిన గాలిదేవర సురేష్ 97.25 మార్కులు సాధించి జిల్లాలో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. సురేష్ తండ్రి జీవీ.కృష్ణారావు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి భద్రకాళీ మాణిక్యాంబ గృహిణి. తండ్రి ప్రోత్సాహం, ప్రభుత్వం నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు సురేష్ తెలిపాడు. సురేష్ ముమ్మిడివరం ప్రైవేటు స్కూల్లో ప్రాథమిక విద్య, అమలాపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. నెల్లూరు జిల్లా ముత్కూరు కాలేజీ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేశాడు. ఎంఎఫ్ఎస్సీ పోస్టు గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలు రాశాడు. సీఎం వైఎస్ జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో తమ లాంటి అర్హులకు ఉద్యోగాలు వస్తున్నాయని సురేష్ ఆనందం వ్యక్తం చేశాడు. -
బనగానపల్లెలో టీడీపీకి షాక్
-
ప్రభుత్వాస్పత్రిలో ఫంగస్ సోకిన సెలైన్
కర్నూలు, బనగానపల్లె: బనగానపల్లె ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో శనివారం రాత్రి ఓ రోగికి ఎక్కించేందుకు సిబ్బంది ఫంగస్ సోకిన సెలైన్ బాటిళ్లను తీసుకురాగా బంధువు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని పంచమపేటకు చెందిన కొత్తమిద్దె మహేష్ వాంతులు, విరేచనాలతో శనివారం రాత్రి 10.30గంటల సమయంలో ఆస్పత్రిలో ఇన్పెషంట్గా చేరారు. డ్యూటీ డాక్టర్ అతడిని పరీక్షించి మందులు, సెలైన్ బాటిళ్ల ఎక్కాల్సిందిగా కేషీట్‌లో రాశారు. అయితే సిబ్బంది ఫంగస్ సోసిన విషయాన్ని గమనించకుండానే రోగికి ఎక్కించేందుకు బాటిళ్లు తీసుకొచ్చారు. రోగి వెంట వచ్చిన రాము ఫంగస్ సోకిన సెలైన్ బాటిళ్లను గుర్తించి వీటిని ఏలా ఎక్కిస్తారంటూ ప్రశ్నించాడు. చూడకపోయిఉంటే అలాగే ఎక్కించే వారు కదా అని వాగ్వాదానికి దిగాడు. అనంతరం రాము 1100కు పోన్‌చేసి ఫంగస్ సోకిన బాటిళ్లను తనవెంట తీసుకెళ్లాడు. ఈ విషయం పై డ్యూటీ డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ ఇందులో తన తప్పు ఏమీలేదన్నారు. తాను రాసిన మందులను రోగులకు వినియోగించడంలో సంబంధిత వార్డు డ్యూటీ సిబ్బంది చూసుకోవాలన్నారు. -
మాజీ ఎమ్మెల్యే కాటసానికి పుత్రశోకం
సాక్షి, బనగానపల్లె : వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి పుత్రశోకం కలిగింది. పెద్దకుమారుడు నాగార్జునరెడ్డి(26) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. కాటసాని రామిరెడ్డి, జయమ్మ దంపతులకు కుమార్తెలు ప్రతిభ, ప్రణతి, కుమారులు నాగార్జునరెడ్డి, ఓబుళరెడ్డి ఉన్నారు. కుమార్తెలద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి భార్యే ప్రతిభ. నాగార్జునరెడ్డి బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్, బెంగళూరులో రియల్ఎస్టేట్ వ్యాపారం నిర్వహించేవాడు. గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బనగానపల్లెకు వచ్చాడు. రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఆప్యాయంగా మాట్లాడి నిద్రకు ఉపక్రమించాడు. అయితే ఉదయం 10 గంటలైనా గది నుంచి బయటకురాకపోవడంతో కుటుంబ సభ్యులు గది వద్దకు వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. కన్నీటి పర్యంతమైన కాటసాని దంపతులు పెద్దకుమారుడు కళ్లముందే విగతజీవిగా పడి ఉండడంతో కాటసాని రామిరెడ్డి దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. కుమారుడి మృతదేహాన్ని చూసి వారు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పాణ్యం మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, తిరుపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు ఇంటి వద్దకు చేరుకొని కాటసాని దంపతులను ఓదార్చారు. విషయం తెలిసిన క్షణాల్లోనే కాటసాని నివాసం జనసంద్రమైంది. ప్రముఖుల నివాళి.. కాటసాని నాగార్జునరెడ్డి మృతదేహానికి రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మనందరెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, వైఎస్సార్సీపీ పత్తికొండ ఇన్చార్జ్ కంగాటి శ్రీదేవి, కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి, ఆళ్లగడ్డ నేత గంగుల నాని, ఎర్రబోతుల వెంకటరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసార«థిరెడ్డి, నంద్యాల టీడీపీ నాయకులు శ్రీధర్‌రెడ్డి, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. దహన సంస్కారాలు: పట్టణ శివారులోని అవుకు రోడ్డులో ఉన్న కాటసాని సొంత స్థలంలో నాగార్జునరెడ్డికి సాయంత్రం దహన సంస్కారాలు నిర్వహించారు. అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర సాగింది. వర్షం వస్తున్నా లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఎస్సార్బీసీ ప్రధాన కాలువకు గండి.
-
ఎస్సార్బీసీ ప్రధాన కాలువకు గండి..
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా బనగానపల్లె శివారులోని ఎస్సార్బీసీ ప్రధాన కాలువకు గండిపడింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చొచ్చుకెళ్తోంది. దాదాపు 30 మీటర్ల మేర గండి పడడంతో... పెండేకంటినగర్ పూర్తిగా జలమయం అయ్యింది. దీంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. గండిని పూడ్చేందుకు పోలీసులు, రైతులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు గండిపడిన ప్రాంతానికి సమీపంలోనే.. మూడేళ్ల కిందట కూడా భారీ గండి పడిందని రైతులు అంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా... అధికారుల పట్టించుకోవడం లేదని, దీంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నేత, బనగానపల్లె నియోజకవర్గ పార్టీ ఇంచార్జి కాటసాని రామిరెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని గండిని పరిశీలించారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మూడేళ్ల కిందట కూడా 60 మీటర్ల మేర గండి పడిందని, కానీ ఎవరూ పట్టించుకోలేదని కాటసాని ఆరోపించారు. మళ్లీ మళ్లీ గండ్లు పడుతుండడం అధికారుల వైఫల్యంగా కన్పిస్తుందని అన్నారు. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సార్బీసీ ప్రధాన కాలువకు గండి పడి గంటలు గడుస్తున్నా.. ఇప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతకంతకూ కాలువ నుంచి నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకెళుతుండటంతో స్థానికులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. -
బనగానపల్లిలో వ్యక్తి దారుణ హత్య
కర్నూలు : కర్నూలు జిల్లా బనగానపల్లె మండల శివారులోని ఓ తోటలో సాంబయ్యశెట్టి(50) అనే వ్యక్తి ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతుడు అనంతపురం జిల్లావాసిగా గుర్తించారు. తోటలో మద్యం సేవించిన అనంతరం ఘర్షణపడి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. (బనగానపల్లె)