కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. దీనిని మహమ్మారిగా ప్రకటించారు. మరోవైపు కొత్తగా వైట్, ఎల్లో ఫంగస్ కేసులూ నమోదవుతున్నాయి. కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడినవారిలో.. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వంటి కోమార్బిడిటీస్ ఉన్నవారిలో రోగ నిరోధక శక్తి తగ్గి.. ఫంగస్‌లు దాడి చేస్తున్నాయి. మరి ఈ ఫంగస్‌లు ఏమిటి? ఎలా సోకుతాయి? వాటితో లక్షణాలు, ప్రమాదాలు ఏమిటనే వివరాలు తెలుసుకుందామా?
– సాక్షి సెంట్రల్ డెస్క్
ఒకరి నుంచి మరొకరికి సోకవు
బ్లాక్, వైట్, ఎల్లో... ఫంగస్ ఏదైనా సరే నిజానికి మన చుట్టూ ఉండే పరిసరాలు, వాతావరణంలోనే ఉంటాయి. వాటిని మన శరీరం తరచూ ఎదుర్కొంటూనే ఉంటుంది. మామూలు పరిస్థితుల్లో అవి మనను ఏమీ చేయలేవు. శరీరం బలహీనమై, రోగ నిరోధక శక్తి తగ్గిపోయినవారిపై మాత్రమే ప్రభావం చూపుతాయి. వైరస్, బ్యాక్టీరియాల తరహాలో ఒకరి నుంచి మరొకరికి సోకుతాయన్న ఆందోళన అవసరం లేదు.
ముందే గుర్తిస్తే చికిత్స సులువు
ఫంగస్ ఇన్ఫెక్షన్ ఏదైనా ముందుగా గుర్తించగలిగితే సులువుగానే చికిత్స చేయవచ్చని వైద్య నిపు ణులు చెప్తున్నారు. ఒక స్థాయి వరకు సాధారణ మందులతోనే బయటపడొచ్చని పేర్కొంటున్నారు. ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయికి చేరి శరీర భాగాలు దెబ్బతినడం మొదలైతే.. ప్రభావవంతమైన యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లు వాడాల్సి ఉంటుందని, శస్త్రచికిత్సలు చేసి ఫంగస్ సోకిన కణజాలా న్ని తొలగించాల్సి వస్తుందని వివరిస్తున్నారు.
చదవండి: వైట్ ఫంగస్: పేగులకు రంధ్రాలు
బ్లాక్ ఫంగస్
బ్లాక్ ఫంగస్ అసలు పేరు మ్యూకోర్ మైకోసిస్. సాధారణంగా మన పరిసరాల్లోనే ఉండే ఈ ఫంగస్.. శరీరం బలహీనమై, రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ప్రభావం చూపడం మొదలుపెడుతుంది. ఏవైనా వ్యాధులకు గురై స్టెరాయిడ్లు, యాంటీ బయాటిక్స్, యాంటీ వైరల్ మందులు అధికంగా వాడినప్పు డు, శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పుడు, మధుమేహం, షుగర్ పెరిగిపోయినప్పుడు ఈ ఫంగస్ దాడిచేసే అవకాశాలు ఎక్కువ. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. 12 వేల మందికి పైగా బ్లాక్ ఫంగస్ బారినపడినట్టు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
లక్షణాలు ఇవీ..
తీవ్రమైన తలనొప్పి, ముక్కు బిగుసుకుపోవడం, ముక్కు నుంచి ఆకుపచ్చ రంగులో స్రావం, ముక్కులోంచి రక్తం కారడం, గొంతు నొప్పి, పంటి నొప్పి, పళ్లు వదులుకావడం, కళ్ల చుట్టూ, ముఖం ఉబ్బడం, చర్మం రంగుమార డం వంటివి బ్లాక్ ఫంగస్ సాధారణ లక్ష ణా లు. ముక్కు లోపలిభాగంలో, కొండనాలుక ఉండే చోట నల్ల రంగు మచ్చలు కనిపిస్తాయి.
► ఈ ఫంగస్ ఊపిరితిత్తులకు వ్యాపిస్తే.. జ్వరం, ఛాతీలో నొప్పి, నోట్లోంచి రక్తం పడటం వంటివి ఏర్పడతాయి.
► బ్లాక్ ఫంగస్ జీర్ణ వ్యవస్థకూ సోకే ప్రమా దం ఉంది. అదే జరిగితే కడుపునొప్పి, పొ ట్ట ఉబ్బడం వంటి లక్షణాలు ఉంటాయి.
► ఈ ఫంగస్ సోకినవారిలో కొందరికి కళ్లు, ముక్కు లోపలి భాగంలో కండరాలను తొలగించాల్సి వస్తుంది.
చదవండి: బ్లాక్ ఫంగస్: నెల రోజుల్లో జిల్లాలో 23 కేసులు
ఎవరికి ప్రమాదకరం?
బ్లాక్ ఫంగస్ బారినపడుతున్న వారి లో 90 శాతానికిపైగా మధుమేహం ఉన్నవారు/ స్టెరాయిడ్లు అధికమో తాదులో వాడినవారేనని ఎయిమ్స్ డైరెక్టర్ ఇటీవలే తెలిపారు.
► అవయవ మార్పిడి చేయించుకున్నవారు, కేన్సర్ వ్యాధికి చికిత్స పొందుతున్న వారు, ఐసీయూలో దీర్ఘకాలం చికిత్స పొందుతున్న వారికి సోకే అవకాశం ఉంది.
► వెరికొనజోల్ థెరపీ (ఊపిరితిత్తులకు సోకే ఓ రకం ఫంగస్ వ్యాధికి చికిత్స) తీసుకుంటున్న వారికి బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
వైట్ ఫంగస్
బ్లాక్, వైట్ ఫంగస్‌ల కన్నా మరింత ప్రమాదకరమైనది ఎల్లో ఫంగస్. దీనిని మ్యూకోర్‌సెప్టిక్‌గా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజి యాబాద్‌లో తొలి ఎల్లో ఫంగస్ కేసును గుర్తిం చారు. బ్లాక్, వైట్ ఫంగస్‌ల లక్షణాలు ఎక్కువగా బయటికి కనిపిస్తే.. ఎల్లో ఫంగస్ లోలోపలే వ్యాపిస్తూ ఉంటుంది. బయటికి పెద్దగా లక్షణాలు కనబడకపోవడంతో దానిని గుర్తించేసరికే ప్రాణాంతకంగా మారు తుందని ఘజియాబాద్ ఆస్పత్రి ఈఎన్‌టీ వైద్యుడు డాక్టర్ త్యాగి తెలిపారు. సాధారణంగా ఎల్లో ఫంగస్ ఎక్కువగా సరీసృపాల (పాములు, బల్లులు, ఇతర పాకే జంతువుల)కు సోకుతుందని.. మనుషు ల్లో దాని ప్రభావంపై అధ్యయనం చేయాల్సి ఉందని ఐసీఎంఆర్‌లో అంటువ్యాధుల విభాగం చీఫ్ సమీరన్ పండా చెప్పారు.
లక్షణాలు ఇవీ..
బద్ధకం, ఆకలి తగ్గడం, బరువు తగ్గిపోవడం వంటివి సాధారణంగా ఎల్లో ఫంగస్ లక్షణా లు. ఈ వ్యాధి ముదిరితే.. గాయాలు తగ్గకపోవడం, చిన్న గాయాలైనా సరే చీము పట్టడం, శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం జరగడం వంటివి కనిపిస్తాయి. చివరికి అవయవాలు దెబ్బతిని ప్రాణాంతకంగా మారుతుంది.
ఎల్లో ఫంగస్

ఎల్లో ఫంగస్ ప్రత్యేకంగా ఎవరికి సోకుతుందన్నదానిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ జరగలేదని వైద్యులు చెప్తున్నారు. రోగ నిరోధకశక్తి తగ్గినవారు, మధుమేహం నియంత్రణలో లేనివారు, కేన్సర్ చికిత్స పొందుతున్నవారు, ఇతర కోమార్బిడిటీస్ ఉన్న వాళ్లపై ఈ ఫంగస్ ప్రభావం చూపుతుందంటున్నారు.

చికిత్స దాదాపు ఒకేలా..
బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్.. ఇలా ఏదైనా దాదాపుగా చికిత్స ఒకే రకంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. చాలా రకాల ఫంగస్‌లను నిర్మూలించగల ‘ఆంఫొటెరిసిన్ బి’ని చికిత్సలో వాడతారు. కాస్త తక్కువ సామర్థ్యం ఉండే ఇతర యాంటీ ఫంగల్ మందులనూ వినియోగిస్తారు. ఫంగస్ ఎక్కువుంటే శస్త్రచికిత్సలు చేసి.. ఫంగస్ సోకిన కణజాలాన్ని తొలగించాల్సి ఉంటుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, మధుమేహం నియంత్రణలో లేకపోవడం, అపరిశుభ్ర పరిస్థితులు ఈ మూడు కూడా ఫంగస్ వ్యాధులకు ఉమ్మడి కారణాలు.
► కరోనా చికిత్సలో అధికంగా స్టెరాయిడ్లు వాడితే ఇమ్యూనిటీ శక్తి దెబ్బతింటుంది. అవసరమైన మేరకే ఉపయోగించాలి.
► మధుమేహం ఉంటే మరింత జాగ్రత్త అవసరం. షుగర్ స్థాయిని తరచూ చెక్ చేసుకుంటూ, మందులు వాడుతూ ఉండాలి.
► పేషెంట్లకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు పెట్టినప్పుడు వాటిల్లోని హ్యుమిడిఫయర్లు, పైపులను తరచూ శుభ్రం చేయాలి. లేకుంటే ఫంగస్ పెరిగి.. నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది.
► ఇల్లు, చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కలప, కాగితం, అట్టడబ్బాలపై ఫంగస్ పెరుగుతుంది. అలాంటివి లేకుండా చూడాలి.
►ఇంట్లో నిల్వ ఆహార పదార్థాలపై ఫంగస్ పెరుగుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు బయటపడేయాలి.
► గదుల్లో తేమ (హ్యుమిడిటీ) తక్కువగా ఉండేలా చూసుకోవాలి. హ్యుమిడిటీ పెరి గితే ఫంగస్ ఎక్కువగా పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment