Covid Patients At Gandhi Hospital: గాంధీ ఆస్పత్రికి మళ్లీ కోవిడ్ బాధితులు పోటెత్తుతున్నారు. ఆస్పత్రిలో శుక్రవారం ఒక్కరోజే 28 మంది చేరారు. ఇన్‌పేషెంట్ వార్డుల్లో సుమారు 70 నుంచి 80 మంది మాత్రమే ఉండగా, తాజాగా ఈ సంఖ్య 111కు చేరింది. ఫలితంగా మెయిన్ బిల్డింగ్‌లోని సెకండ్ ఫ్లోర్ రోగులతో పూర్తిగా నిండిపోవడంతో కొత్తగా వచ్చే రోగుల కోసం మూడో వార్డును సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో 11 మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
వీరిలో మరో ఎనిమిది మంది బ్లాక్‌ఫంగస్ బాధితులు కూడా ఉన్నారు. తగ్గినట్లే తగ్గిన ఇన్‌పేషంట్ల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో ఆస్పత్రి వైద్యులు అప్రమత్తమయ్యారు. సాధారణ అడ్మిషన్లను, సర్జరీలను నిలిపివేశారు. గచ్చిబౌలిలోని టిమ్స్‌లోనూ ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ వంద మందికిపైగా చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువగా ఒమిక్రాన్ బాధితులే.
చదవండి: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..
Comments
Please login to add a commentAdd a comment