ఫంగస్‌తో దోమల నివారణ!
దోమల శరీరాలకు తాకిన వెంటనే ఫంగస్ పెరగడం మొదలై.. కొంత సమయానికి శరీరంలోకి చొచ్చుకుపోయి చంపేస్తుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న బ్రెయిన్ లోవెట్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఫంగస్ బారిన పడ్డ దోమ మనుషుల రక్తం పీల్చడం కూడా మానేస్తుందని.. ఫలితంగా మలేరియా వంటి వ్యాధుల వ్యాప్తిని అతి తక్కువ కాలంలోనే అడ్డుకోవచ్చని వివరించారు. రసాయన మందులతో పోలిస్తే ఈ ఫంగస్ దోమపై చూపే ప్రభావం చాలా భిన్నమైందని, దోమ నాడీవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్త రేమండ్ పేర్కొంటున్నారు. ఇదే సమయంలో ఫంగస్ విడుదల చేసే విషం కేవలం దోమ రక్తంలో మాత్రమే చైతన్యవంతమయ్యేలా జన్యుపరమైన స్విచ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఇతరులకు ఎలాంటి ప్రమాదం లేకుండా చేశామని వివరించారు.