
సమావేశంలో మాట్లాడుతున్న మణిపాల్ హాస్పిటల్ వైద్యులు
తాడేపల్లిరూరల్: మణిపాల్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ కింద బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌ను చేస్తున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కంటిపూడి సుధాకర్ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మణిపాల్‌లో ఇప్పటివరకు 50 బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. క్లిష్టతరమైన, ఖర్చుతో కూడుకున్న ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావటం అభినందించదగ్గ విషయం అన్నారు.
బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ జి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ తరహా క్లిష్టమైన చికిత్సల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా మణిపాల్‌లో అద్భుతమైన చికిత్స లభిస్తోందని తెలిపారు. అంకాలజిస్ట్ డాక్టర్ మాధవ్ దంతాల మాట్లాడుతూ.. బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ రెండు రకాలని, వాటిలో ఒకటి ఆటోలోగస్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని, రెండవది అల్లోజెనిక్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.శ్రావణ్‌కుమార్, డాక్టర్ సీహెచ్ మనోజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment