సాక్షి, గుంటూరు: ఆంధ్రరాష్ట్ర విభజన అనంతరం 2016లో ఆరోగ్యశ్రీ పథకం కింద గుంటూరుకు చెందిన ఉప్పు ఏడుకొండలు అనే వ్యాధిగ్రస్తునికి తొలిసారిగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసినట్లు డా వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి తెలిపారు. గుంటూరు సమగ్ర ప్రభుత్వ వైద్యశాలలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. గత నాలుగేళ్లుగా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా మూడు గుండె మార్పిడి చికిత్సలు నిర్వహించినట్లు వెల్లడించారు. (పెద్ద కంపెనీలతో అనుసంధానం ముఖ్యం)
కాగా ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ పొరుగు రాష్ట్రాల ముఖ్య నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని సూపర్ మల్టీస్పెషాలిటీ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉచిత వైద్య చికిత్స అందించడం కోసం నవంబర్ 1, 2019 నుంచి ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందిన వారిలో ఆనంద్ అనే వ్యక్తి గత నాలుగేళ్లుగా గుండె వ్యాధితో బాధపడుతున్నాడని, ఈ క్రమంలో ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈఓ మల్లికార్జున సహాయంతో బెంగళూరు ఆస్పత్రిలో గుండె మార్పిడి చికిత్స జరిగిందన్నారు. (ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్)
ఈ పథకం ద్వారా గుండె మార్పిడి శస్త్ర చికిత్స ప్యాకేజీలో భాగంగా పదకొండు లక్షల రూపాయల మొత్తాన్ని రోగికి అయిన ఖర్చును వైదేహి ఆస్పత్రికి అందించినట్లు తెలిపారు. రూపాయి ఖర్చు లేకుండా ఆనంద్ గుండె మార్పిడి చికిత్స పొందినట్లు ఆయన వెల్లడించారు. ఆపరేషన్ జరిగిన అయిదో రోజున కోలుకొని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, ఆరోగ్య శ్రీ ట్రస్ట్ వారికి క`తజ్ఞతలు తెలియ జేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment