సాక్షి, గుంటూరు: ఆరోగ్యశ్రీపై మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్‌కు లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎవరి హయాంలో ఆరోగ్యశ్రీ ఎలా అమలైందో చర్చకు సిద్ధమా? దమ్ముంటే ఆరోగ్యశ్రీపై చంద్రబాబు, లోకేష్ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
‘‘గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు. ఆరోగ్యశ్రీని వెంటిలేటర్‌పై ఉంచారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన వారి పేరైనా లోకేష్ చెప్పగలరా?. 3257 ప్రొసీజర్స్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత సీఎం జగన్‌ది’’ అని మంత్రి పేర్కొన్నారు.
‘‘గత ప్రభుత్వంలో ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేదు. మా హయాంలో ఈ ఒక్క ఏడాదిలోనే 3,400 కోట్లు ఖర్చుపెట్టాం. నాలుగేళ్లలో 10,100 కోట్లు ఖర్చుపెట్టాం. వార్షికాదాయం 5 లక్షలు ఉన్న వారికి కూడా ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నాం. మా హయాంలో 2275 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందుతుంది’’ అని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.
చదవండి: ఇంత బిల్డప్ ఇచ్చారు.. తీరా చూస్తే.. ఇదేంటి ఆనం..
Comments
Please login to add a commentAdd a comment