చిన్నారి తాతకు ఆరోగ్యశ్రీ కార్డు అందిస్తున్న పంచాయతీ కార్యదర్శి ఢిల్లేశ్వరరావు
కొత్తూరు: క్యాన్సర్‌తో బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి ఆరోగ్యశ్రీ కార్డు మంజూరైంది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఓండ్రుజోలకు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి వైద్యం కోసం తల్లిదండ్రులు గెల్లంకి రవికుమార్, సుధారాణిలు నానా అగచాట్లుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని వలంటీర్‌ను కోరారు.
ఈ నేపథ్యంలో చిన్నారి తల్లిదండ్రుల ఈకేవైసీ కోసం వలంటీర్ బెంగళూరు వెళ్లి ఈ నెల 14న తల్లిదండ్రులతో పాటు చిన్నారి వేలిముద్రలు కూడా తీసుకుని ఈకేవైసీ చేయించాడు. అనంతరం శనివారం ఆరోగ్యశ్రీకార్డు మంజూరు కావడంతో దానిని చిన్నారి తాతయ్య చలపతిరావుకు అందించారు. ఆరోగ్యశ్రీ కార్డు మంజూరైన విషయాన్ని తెలుసుకున్న బెంగళూరులోని చిన్నారి తల్లిదండ్రులు సంతోషంతో వలంటీర్‌కు, గ్రామ సచివాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తమ మనువడిని హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో వైద్యం చేయించేందుకు తీసుకెళుతున్నట్టు చలపతిరావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment