సాక్షి, హైదరాబాద్: బొగ్గుగనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని బొగ్గు గనుల వద్ద నిరసనలు చేపట్టింది. దానిలో భాగంగా హైదరాబాద్‌లోని సింగరేణిభవన్‌ను కార్మిక సంఘం నేతలు, ఇతర సింగరేణి కార్మికులు ముట్టడించారు. కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ..
జులై 2న సింగరేణిలో ఒక్కరోజు సమ్మెకు పిలుపునిస్తున్నామని తెలిపారు. 41,500 బొగ్గుగనులను కేంద్రం వేలం వేయబోతోందని మండిపడ్డారు. కోల్ ఇండియాలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. దేశానికి వెలుగునిచ్చే బొగ్గుగనులు కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం దేశ భక్తి పేరుతో జాతి సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నం చేస్తోందని రాజిరెడ్డి విమర్శించారు. ‘ప్రైవేటీకరణ అంటే మన హక్కులను కాలరాయడమే’అని ఆయన పేర్కొన్నారు.
(చదవండి: సింగరేణి ప్రైవేటీకరణ దుర్మార్గచర్య)
Comments
Please login to add a commentAdd a comment