Coal mines auction
-
బొగ్గు గనుల వేలంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
-
బొగ్గు గనుల వేలంను వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్
-
బొగ్గు గనుల కోసం పోటా పోటీ
న్యూఢిల్లీ: బొగ్గు గనుల వేలానికి భారీ స్పందన కనిపించింది. ఏడో విడత బొగ్గు గనుల వేలంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 103 బ్లాకులను ఆఫర్ చేసింది. 18 బొగ్గు గనులకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ కలసి 35 బిడ్లు దాఖలైనట్టు బొగ్గు శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించి టెక్నికల్ బిడ్లను బుధవారం తెరిచారు. ఎన్టీపీసీ, ఎన్ఎల్సీ ఇండియా, జేఎస్పీఎల్ తదితర 22 కంపెనీలు వేలంలో పోటీ పడుతున్నాయి. 18 బొగ్గు గనుల్లో 9 పాక్షికంగా బొగ్గు అన్వేషించినవి. మిగిలిన గనుల్లో అన్వేషణ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నిర్వహించారు. వీటి ద్వారా ఏటా 51.80 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయవచ్చు. 17 నాన్ కోకింగ్ కోల్ కాగా, ఒకటి కోకింగ్ కోల్‌మైన్. జేఎస్పీఎల్, ఎన్ఎల్సీ ఇండియా, బజ్రంగ్ పవర్ అండ్ ఇస్పాత్ లిమిటెడ్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జీఎండీసీ), బుల్ మైనింగ్ ప్రైవేటు లిమిటెడ్ ఒక్కోటీ మూడు బ్లాకులకు బిడ్లు వేశాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ మైనింగ్, సన్‌ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ ఒక్కోటీ రెండు కోల్ బ్లాక్‌ల కోసం పోటీ పడుతున్నాయి. నల్వా స్టీల్ అండ్ పవర్, నువోకో విస్టాస్ కార్ప్, ఒడిశా కోల్ అండ్ పవర్ తదితర 14 కంపెనీలు ఒక్కో బ్లాక్ కోసం బిడ్లు దాఖలు చేశాయి. -
రేపు ఏడో విడత బొగ్గు గనుల వేలం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏడో విడత బొగ్గు గనులను ఈ నెల 29న వేలం వేయనుంది. వేలం ద్వారా 106 బొగ్గు గనులను ఆఫర్ చేయనుంది. ఆరో విడతలో వేలం వేసిన 28 బొగ్గు గనులకు సంబంధించి ఒప్పందాలపై అదే రోజు సంతకాలు చేయనున్నట్టు బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ 28 బొగ్గు గనుల్లో గరిష్టంగా 74 మిలియన్ టన్నుల మేర వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని పేర్కొంది. ఏటా వీటి నుంచి రూ.14,497 కోట్ల ఆదాయం వస్తుందని.. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత లక్ష మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించింది. ఇక ఏడో విడత వేలానికి ఉంచే 106 బొగ్గు గనుల్లో 61 గనులు కొంత వరకు అన్వేషించినవి కాగా, 45 గనుల్లో అన్వేషణ పూర్తయినట్టు బొగ్గు శాఖ తెలిపింది. మొత్తం 106 గనుల్లో 95 నాన్ కోకింగ్ కోల్, ఒకటి కోకింగ్ కోల్, 10 లిగ్నైట్ గనులుగా వెల్లడించింది. -
విధాన స్థిరత్వం, పారదర్శకత బాటన భారత్
న్యూఢిల్లీ: దేశంలో పెట్టుబడులను పురోభివృద్దికి పాలసీ స్థిరత్వం, పారదర్శకత, చక్కటి సంప్రదింపుల ప్రక్రియ బాటను అందిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పేర్కొన్నారు. దేశంలో ఇంధన వనరుల రంగంలో అవకాశాలు అపారమన్న ఆమె, ఈ అవకాశాలను అందిపుచ్చుకోడానికి పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. బొగ్గు అమ్మకానికి సంబంధించి ఆరవ విడత గనుల వేలం పక్రియ ప్రారంభం సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘ఈ అమృత్ కాలం (భారత్ స్వాతంత్రం సముపార్జించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా) సమయంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సమయంలో భారతదేశానికి అన్ని ప్రాథమిక ఖనిజాలు అవసరం. ఈ రంగంలో పెట్టుబడుల అవకాశాలు అపారం’ అని ఆర్థికమంత్రి ఈ సందర్బంగా పేర్కొన్నారు. పెట్టుబడులకు తగిన దేశం భారత్ అని మోర్గాన్ స్టాన్లీ చేసిన వ్యాఖ్యను ఆర్థికమంత్రి ప్రస్తావించారు. బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ వాణిజ్య గనుల ఆరవ విడత వేలంలో 141 బొగ్గు, లిగ్నైట్ గనులను విక్రయించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 67 బొగ్గు గనులను కమర్షియల్ మైనింగ్ కింద అమ్మకానికి ఉంచినట్లు కూడా తెలిపారు. ప్రపంచంలో పలు దేశాలు మందగమనం ముందు నుంచొన్న సమయంలో భారత్ పటిష్ట వృద్ధి బాటన పయనిస్తోందని తెలిపారు. ఆరవ విడత బొగ్గు గనుల వేలం పక్రియను ప్రారంభిస్తున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ -
నిరసనలు: మోదీ దిష్టిబొమ్మ దగ్ధం
సాక్షి, హైదరాబాద్: బొగ్గుగనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని బొగ్గు గనుల వద్ద నిరసనలు చేపట్టింది. దానిలో భాగంగా హైదరాబాద్‌లోని సింగరేణిభవన్ను కార్మిక సంఘం నేతలు, ఇతర సింగరేణి కార్మికులు ముట్టడించారు. కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ.. జులై 2న సింగరేణిలో ఒక్కరోజు సమ్మెకు పిలుపునిస్తున్నామని తెలిపారు. 41,500 బొగ్గుగనులను కేంద్రం వేలం వేయబోతోందని మండిపడ్డారు. కోల్ ఇండియాలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. దేశానికి వెలుగునిచ్చే బొగ్గుగనులు కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం దేశ భక్తి పేరుతో జాతి సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నం చేస్తోందని రాజిరెడ్డి విమర్శించారు. ‘ప్రైవేటీకరణ అంటే మన హక్కులను కాలరాయడమే’అని ఆయన పేర్కొన్నారు. (చదవండి: సింగరేణి ప్రైవేటీకరణ దుర్మార్గచర్య) -
‘ఆ నిర్ణయంతో 2.8 లక్షల ఉద్యోగాలు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్‌లో ఆవిష్కరించిన విజన్‌కు అనుగుణంగా 41 బొగ్గు గనుల వేలం ప్రకియ ద్వారా దేశంలో 2.8 లక్షలకు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. వాణిజ్య మైనింగ్ కోసం 41 బొగ్గు గనుల వేలం ప్రక్రియకు ప్రధాని గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సమకూరడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా 20,000 కోట్ల రాబడి అందివస్తుందని అన్నారు. బొగ్గు ఉత్పత్తులు పెరగడంతో పాటు పోటీని ఆహ్వానించడం ద్వారా భారత్ ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించేలా ఈ చారిత్రక నిర్ణయం ఉపకరిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం 41 బొగ్గు గనులను వాణిజ్య మైనింగ్‌కు వేలం ప్రక్రియ ప్రారంభించిన అనంతరం హోంమంత్రి షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి : ప్రధాని బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్‌తో పోరులో భారత్ విజయం సాధిస్తుందని, మహమ్మారిని భారత్ అవకాశంగా మలుచుకుందని అన్నారు. కోవిడ్-19 భారత్‌ను స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రేరేపించిందని వ్యాఖ్యానించారు. గతంలో బొగ్గుగనుల వేలంలో అవినీతి చోటుచేసుకోగా ఇప్పుడు పారదర్శకంగా వేలం ప్రక్రియను చేపడతున్నామని చెప్పారు. బొగ్గు గనుల అభివృద్ధి, సాంకేతిక రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులతో వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. చదవండి : మళ్లీ తెర ముందుకు అమిత్ షా! -
‘బొగ్గు’లో సంస్కరణల బాజా
న్యూఢిల్లీ: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచడంతో పాటు మరింతగా పెట్టుబడులు ఆకర్షించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంది. గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957, బొగ్గు గనులు (స్పెషల్ ప్రొవిజన్స్) చట్టం 2015లో సవరణలను సవరిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం.. బొగ్గుయేతర సంస్థలు కూడా బొగ్గు గనుల బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. అలాగే, అంతిమంగా బొగ్గు వినియోగంపైనా ఆంక్షలు ఉండవు. కేంద్ర క్యాబినెట్ భేటీ అనంతరం బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయాలు వెల్లడించారు. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా కనీస అర్హత గల ఏ కంపెనీ అయినా బొగ్గు గనుల వేలంలో పాల్గొనవచ్చు. ఈ కొత్త నిబంధనల కింద జనవరిలోనే తొలి విడత వేలం నిర్వహించనున్నట్లు బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ జైన్ చెప్పారు. మొదటి విడతలో 40 బొగ్గు బ్లాకుల దాకా వేలం వేయనున్నట్లు వివరించారు. మరోవైపు, మార్చి 31తో మైనింగ్ లీజు ముగిసిపోయే ముడి ఇనుము, ఇతర ఖనిజాల గనుల వేలాన్ని గడువులోగా నిర్వహించే ప్రతిపాదనకు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. కోల్ ఇండియాకూ మద్దతు ఉంటుంది.. అవకతవకల ఆరోపణల కారణంగా.. 2014లో సుప్రీం కోర్టు 204 బొగ్గు బ్లాకుల కేటాయింపును రద్దు చేసింది. అయితే, అంతిమంగా వినియోగించే అంశానికి సంబంధించి పరిమితుల కారణంగా వాటిలో కేవలం 29 బ్లాకులను మాత్రమే వేలం వేయడం జరిగింది. తాజాగా ఆంక్షలను ఎత్తివేయడంతో మిగతా బ్లాకుల వేలానికీ మార్గం సుగమం అవుతుందని జోషి చెప్పారు. ఈ రంగంలో పోటీని పెంచేందుకు, బొగ్గు దిగుమతులను తగ్గించుకునేందుకు, ప్రభుత్వ రంగ కోల్ ఇండియా గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు కూడా ఈ చర్యలు ఉపయోగపడనున్నట్లు జైన్ చెప్పారు. అలాగని కోల్ ఇండియా ప్రాధాన్యాన్ని తగ్గించే యోచనేదీ లేదని, దాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. 2023 నాటికి 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు దానికి తగినన్ని బ్లాక్‌లు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు, 334 నాన్–క్యాప్టివ్ ఖనిజ గనుల లీజు ఈ ఏడాది మార్చి 31తో ముగిసిపోనుంది. ఇవి మూతబడితే దాదాపు 60 మిలియన్ టన్నుల ముడి ఇనుము కొరత ఏర్పడవచ్చని జోషి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉత్పత్తికి కోత పడకుండా గడువులోగా ఖనిజాల గనుల వేలాన్ని కూడా నిర్వహించాలని.. బిడ్డింగ్‌లో గెలుపొందిన సంస్థకు ఇతరత్రా అటవీ, పర్యావరణ అనుమతులు కూడా బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. దీని వల్ల రెండేళ్ల సమయం ఆదా అవుతుందని, ఎలాంటి అవరోధాలు లేకుండా ఉత్పత్తి యథాప్రకారంగా కొనసాగుతుందని చెప్పారు. అత్యంత భారీ సంస్కరణలు: ప్రధాన్ వాణిజ్య అవసరాల కోసం బొగ్గు ఉత్పత్తి చేసేందుకు 2018లో ప్రైవేట్ కంపెనీలకూ అనుమతినిచ్చినప్పటికీ.. బొగ్గుపరిశ్రమయేతర సంస్థలను వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించలేదు. తాజా మార్పుచేర్పులు బొగ్గు పరిశ్రమలో అత్యంత భారీ సంస్కరణలని చమురు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభివర్ణించారు. కేంద్ర నిర్ణయాన్ని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ స్వాగతించారు. ‘ఏటా 15 బిలియన్ డాలర్లకు పైగా ఉంటున్న బొగ్గు దిగుమతులను తగ్గించుకోవడానికి గణనీయంగా ఉపయోగపడుతుంది. చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గుల తరుణంలో.. ఇంధన రంగంలో భారత్ స్వయం సమృద్ధికి తోడ్పడుతుంది‘ అని జిందాల్ చెప్పారు. అంతిమ వినియోగంపై ఆంక్షల ఎత్తివేత నిర్ణయం.. దేశీయంగా బొగ్గు నిల్వల వెలికితీతకు, మరిన్ని విదేశీ సంస్థలు ఇన్వెస్ట్ చేసేందుకు తోడ్పడగలదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ చెప్పారు. బొగ్గు మైనింగ్ ఆర్డినెన్స్‌ను ఉక్కు పరిశ్రమ స్వాగతించింది. బొగ్గు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది తోడ్పడగలదని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ పేర్కొంది. ఈ సంస్కరణల ఊతంతో దేశీ ఉక్కు పరిశ్రమ .. అంతర్జాతీయ స్థాయిలో మరింతగా పోటీపడగలదని తెలిపింది. నీలాచల్ ఇస్పాత్ విక్రయానికీ గ్రీన్‌సిగ్నల్.. ఉక్కు సంస్థ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ (ఎన్ఐఎన్ఎల్)లో ఆరు ప్రభుత్వ రంగ సంస్థల వాటాల వ్యూహాత్మక విక్రయానికి కూడా కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ విషయాన్ని తెలిపారు. ఎన్ఐఎన్ఎల్లో ఎంఎంటీసీ, ఎన్ఎండీసీ, బీహెచ్ఈఎల్, ఎంఈసీవోఎన్, ఐపీఐసీవోఎల్, ఒడిషా మైనింగ్ కార్పొరేషన్లకు వాటాలు ఉన్నాయి. మరోవైపు, నీలాచల్ ఇస్పాత్‌లో వాటాల విక్రయ ప్రతిపాదనను ఉక్కు రంగ కార్మికుల సమాఖ్య ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ ఖండించింది. భూషణ్ స్టీల్, ఆధునిక్ స్టీల్ వంటి ప్రైవేట్ రంగ సంస్థలు మూతబడుతుంటే ప్రభుత్వ రంగంలోని సంస్థలు మెరుగ్గానే పనిచేస్తున్నాయని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.కె. దాస్ చెప్పారు. వాటాల విక్రయ ప్రతిపాదనలను ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే కార్మికులు సమ్మెకు దిగేందుకు సిద్ధమని తెలిపారు. -
హిందాల్కో, జిందాల్ పవర్‌కు బొగ్గు బ్లాకులు
-
హిందాల్కో, జిందాల్ పవర్‌కు బొగ్గు బ్లాకులు
న్యూఢిల్లీ: బొగ్గు గనుల వేలంలో గురువారం జిందాల్ పవర్ రెండు, ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ ఒకటి చొప్పున బ్లాకులను దక్కించుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో గనులకు జిందాల్ పవర్ రూ. 1,679 కోట్లు, గెరె పామా బ్లాకు కోసం హిందాల్కో రూ. 14,858.9 కోట్లు వెచ్చించనున్నట్లు బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్.. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్వీటర్ ద్వారా వెల్లడించారు. గెరె పామా 4/5 బ్లాకులో 42.43 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. టన్నుకు రూ. 3,502 మేర బిడ్డింగ్ చేసి హిందాల్కో దీన్ని దక్కించుకున్నట్లు అనిల్ స్వరూప్ పేర్కొన్నారు. ఈ బ్లాకు కోసం దాదాపు 12 గంటల పాటు సాగిన బిడ్డింగ్‌లో హిందాల్కోతో పాటు అంబుజా సిమెంట్స్, బాల్కో, హిందాల్కో తదితర సంస్థలు పోటీపడ్డాయి. ప్రభుత్వం మొదటి విడతగా 19 బొగ్గు బ్లాకులు వేలానికి ఉంచగా ఇప్పటిదాకా 15 బ్లాకులను కంపెనీలు దక్కించుకున్నాయి. బిఛర్పూర్ గనికి బిడ్డింగ్ కొనసాగుతోంది. తొలి విడత ఫిబ్రవరి 22న ముగియనుంది. జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ ఎనర్జీ, రిలయన్స్ సిమెంట్, సన్‌ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్, జైప్రకాష్ అసోసియేట్స్, బాల్కొ తదితర సంస్థలు బొగ్గు గనులను దక్కించుకున్నాయి. బొగ్గు బ్లాకుల వేలం ద్వారా ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు రూ. 50,000 కోట్ల పైచిలుకు ఆదాయం రాగలదని అంచనా.