సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్‌లో ఆవిష్కరించిన విజన్‌కు అనుగుణంగా 41 బొగ్గు గనుల వేలం ప్రకియ ద్వారా దేశంలో 2.8 లక్షలకు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. వాణిజ్య మైనింగ్ కోసం 41 బొగ్గు గనుల వేలం ప్రక్రియకు ప్రధాని గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సమకూరడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా 20,000 కోట్ల రాబడి అందివస్తుందని అన్నారు. బొగ్గు ఉత్పత్తులు పెరగడంతో పాటు పోటీని ఆహ్వానించడం ద్వారా భారత్ ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించేలా ఈ చారిత్రక నిర్ణయం ఉపకరిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం 41 బొగ్గు గనులను వాణిజ్య మైనింగ్‌కు వేలం ప్రక్రియ ప్రారంభించిన అనంతరం హోంమంత్రి షా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంధన రంగంలో స్వయం సమృద్ధి : ప్రధాని
బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్‌తో పోరులో భారత్ విజయం సాధిస్తుందని, మహమ్మారిని భారత్ అవకాశంగా మలుచుకుందని అన్నారు. కోవిడ్-19 భారత్‌ను స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రేరేపించిందని వ్యాఖ్యానించారు. గతంలో బొగ్గుగనుల వేలంలో అవినీతి చోటుచేసుకోగా ఇప్పుడు పారదర్శకంగా వేలం ప్రక్రియను చేపడతున్నామని చెప్పారు. బొగ్గు గనుల అభివృద్ధి, సాంకేతిక రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులతో వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment