coal mines workers
-
పేర్లు.. పింఛను వెతలు...
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఎఫ్) విధించిన కొత్త నిబంధన కొందరు రిటైర్డ్ సింగరేణి కార్మికులకు ఇబ్బందిగా మారింది. వాస్తవానికి విశ్రాంత కార్మికుల సంక్షేమానికి సీఎంపీఎఫ్ బతికిఉన్న ప్రతీ కార్మికుడు, అతడి భార్య వివరాలు డిజిటలైజేషన్ చేయాలని ఇటీవల నిర్ణయించింది. కొందరు సింగరేణి కార్మికుల భార్యలు మరణించగా, రెండో వివాహం చేసుకున్నారు. ఇలాంటి వారి వివరాలు ఇంతవరకూ డిజిటలైజ్ కాలేదు. అందుకే, భార్యల ప్ర యోజనాలు కాపాడేందుకు, వితంతువులకు పింఛన్ ఇవ్వాలన్న సదుద్దేశంతో సీఎంపీఎఫ్ ఈ కార్యక్రమాన్ని కొద్దిరోజులుగా కోల్‌బెల్ట్‌లో మొదలుపెట్టింది. రిటైరైన కార్మికులంతా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి, ఆధార్ వివరాలు సమర్పిస్తున్నారు. ఇందుకోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తమకోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నా రు. సింగరేణి వ్యాప్తంగా రిటైర్డ్ కార్మికులు 84,808 మంది ఉన్నారు. న్యాయపరమైన చిక్కులతోనే... సింగరేణిలో చాలామంది కార్మికులు గతంలో అలియాస్ పేర్లతో విధులు నిర్వర్తించేవారు. అప్పట్లోయాజమాన్యం కూడా దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ సమస్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వాల దృష్టిలో ఉన్నదే. తెలంగాణ ఆవిర్భవించాక రెండుపేర్లు ఉన్న కార్మికుల ప్రయోజనాలు పరిరక్షిస్తామని సీఎం హామీ ఇచ్చినా..న్యాయపరమైన చిక్కుల వల్ల కార్యరూపం దాల్చలేదు. అయితే, ఇప్పుడు సీఎంపీఎఫ్ విధించిన కొత్త నిబంధనలు రెండు పేర్లున్న సింగరేణి కార్మికుల పాలిట ప్రతికూలంగా మారాయి. రెండు రోజులుగా తిరుగుతున్నా జీడీకే–2గనిలో కోల్‌ఫిల్లర్‌గా పనిచేసి తొమ్మిదేళ్ల కిందట రిటైర్డ్ అయ్యా. అప్పటి నుంచి పెన్షన్ తీసుకుంటున్నా. పాత రామగుండం నుంచి 2 రోజులుగా బ్యాంకుకు వచ్చి వెళ్తున్నా. ఇంకా పని కాలేదు. ఇద్దరికి బ్యాంకు అకౌంట్లు ఉండాలంటున్నారు. తర్వాతే జాయింట్ చేస్తామని చెబుతున్నారు. - ఈదునూరి శంకర్ రిటైర్డ్ కార్మికుడు గర్రెపల్లి నుంచి వచ్చా జీడీకే–2ఏ గనిలో పనిచేసి 11 ఏళ్ల కిందట రిటైర్డ్ అయ్యా. మళ్లీ అన్ని పేపర్లు అడుగుతున్నారు. చేతకాకున్నా మనుమడిని పట్టుకొని బ్యాంకుకు వచ్చా. గంటల తరబడి లైన్లో కూర్చోవాల్సి వచ్చింది. మళ్లీ పేపర్లు అన్నీ నింపి ఫొటోలు ఇవ్వాల్సి రావడం ఆలస్యం అవుతోంది. - పిట్టల గంగయ్య రిటైర్డ్ కార్మికుడు 20 శాతం మారుపేర్లతోనే... సింగరేణిలో పనిచేసి రిటైర్డ్ అయిన కార్మికుల్లో సుమారు 20శాతం మంది మారుపేర్లతో పనిచేశారు. వీరికి సింగరేణిలో ఒకపేరు, సొంత గ్రామంలో మరోపేరు ఉంది. వీరందరికీ మొన్నటి వరకూ రెండు ఆధార్‌కార్డులు కూడా ఉన్నాయి. కరోనా తర్వాత కేంద్రం రెండు పేర్లతో ఉన్న ఆధార్‌కార్డుల తొలగింపు మొదలుపెట్టింది. దీంతో వందలాదిమంది సింగరేణి కార్మికులు తమ ఆధార్‌కార్డులు కోల్పోవాల్సి వచ్చింది. కొందరు మారుపేరు కార్డు కోల్పోగా, మరికొందరు సొంత పేరుతో ఉన్న కార్డులు కోల్పోయారు. ప్రస్తుతం ఇదే ఇబ్బందిగా మారింది. వితంతువులకు కూడా ఇది ఇబ్బందికరంగా మారింది. అందుకే, మారుపేర్లతో ఉన్న కార్మికులను అలియాస్ పేరుతో నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అసలు తమకు వచ్చేది అరకొర పింఛన్ అని, దానికి ఇన్ని తిప్పలు పెట్టి తమ పొట్టకొట్టొద్దని వేడుకుంటున్నారు. ఊర్లో ఉన్న ఆస్తులు రైతుబంధు, రైతుబీమా వివిధ సంక్షేమ పథకాలకు సొంతపేరుతో ఉన్న ఆధార్‌కార్డు లింక్ అయ్యాయని, ఇప్పుడు తామేం చేయాలో తెలియని అయోమయ స్థితి నెలకొందని వాపోతున్నారు. యాల్సి వచ్చిందని విలపించారు. -
పాక్‌లో 11మంది గని కార్మికుల కాల్చివేత
కరాచీ: అల్పసంఖ్యాక వర్గాల ప్రజలే లక్ష్యంగా పాకిస్తాన్లో దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా, మైనారిటీ షియా హజారా వర్గానికి చెందిన 11 మంది గని కార్మికులను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. బలూచిస్తాన్ ప్రావిన్సు క్వెట్టాలోని మాచ్ బొగ్గుగని వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు గని కార్మికులు ఆదివారం ఉదయం విధులకు వెళ్తుండగా సాయుధ దుండగులు వారిని బెదిరించి, సమీపంలోని కొండ ప్రాంతానికి తీసుకెళ్లారు. అందులో మిగతా వారిని వదిలేసి, హజారా వర్గం కార్మికులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనకు ఎవరూ బాధ్యత ప్రకటించుకోలేదు. సున్నీ తీవ్రవాద సంస్థ లష్కరే జంఘ్వి గతంలో బలూచి స్తాన్‌లోని మైనారిటీ హజారా వర్గంపై పలు మార్లు దాడులకు పాల్పడింది. -
నిరసనలు: మోదీ దిష్టిబొమ్మ దగ్ధం
సాక్షి, హైదరాబాద్: బొగ్గుగనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని బొగ్గు గనుల వద్ద నిరసనలు చేపట్టింది. దానిలో భాగంగా హైదరాబాద్‌లోని సింగరేణిభవన్ను కార్మిక సంఘం నేతలు, ఇతర సింగరేణి కార్మికులు ముట్టడించారు. కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ.. జులై 2న సింగరేణిలో ఒక్కరోజు సమ్మెకు పిలుపునిస్తున్నామని తెలిపారు. 41,500 బొగ్గుగనులను కేంద్రం వేలం వేయబోతోందని మండిపడ్డారు. కోల్ ఇండియాలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. దేశానికి వెలుగునిచ్చే బొగ్గుగనులు కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం దేశ భక్తి పేరుతో జాతి సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నం చేస్తోందని రాజిరెడ్డి విమర్శించారు. ‘ప్రైవేటీకరణ అంటే మన హక్కులను కాలరాయడమే’అని ఆయన పేర్కొన్నారు. (చదవండి: సింగరేణి ప్రైవేటీకరణ దుర్మార్గచర్య) -
వారి ఆధార్ కార్డ్ నెంబరే పీఎఫ్ నంబర్
భువనేశ్వర్ :దేశంలో ఉన్న లక్షలమంది బొగ్గు గని కార్మికులకు మేలుచేసే లక్ష్యంతో కోల్ ఇండియా లిమిటెడ్ ఓనిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కాంట్రాక్ట్ , అసంఘటిత కార్మికుల పీఎఫ్ కష్టాలను నెరవేర్చేందుగాను కార్మికుల ఆధార కార్డు నంబరునే పీఎఫ్ నెంబర్ గా పరిగణించేందుకు నిర్ణయించింది. ఒడిశాలోని పూరిలో జరిగిన కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) అనుబంధ సంస్థల డైరెక్టర్లు (పర్సనల్), కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఎఫ్‌వో) కమిషనర్ బీకే పాండా, సీఎంపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాల అధికారులు హాజరైన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయం ప్రకారం దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో పనిచేస్తున్న 5 లక్షల కార్మికుల ఆధార్ నెంబరును ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు అనుసంధానం చేస్తారు. అనంతరం ఆ నంబరునే బొగ్గు గనుల ప్రావిడెంట్ ఫండ్ నంబరుగా పరిగణించనున్నారు. ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నామని, గుడ్ గవర్నెన్స్ దినంగా పాటించే డిసెంబర్ 25, 2016 నుంచి అమల్లోకి వస్తుందని మహానంది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ డైరెక్టర్ (పర్సనల్) ఎల్ ఎన్ మిశ్రా చెప్పారు. దీనివ్లల కాంట్రాక్ట్ కార్మికులకు, అసంఘటిత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అలాగే బొగ్గుగని కార్మికుల డాటా బేస్ ను తయారుచేస్తున్నామని, ఒక పోర్టల్ కూడా రూపొందించనున్నామని తెలిపారు. దీంతోపాటూ ఆన్ లైన్ లోనే పీఎఫ్ వివరాలు తెలుసుకోవడం, ఎస్ఎమ్మెస్ తదితర సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు.