పాక్‌లో 11మంది గని కార్మికుల కాల్చివేత | Gunmen kill 11 minority Shiite coal miners in SW Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌లో 11మంది గని కార్మికుల కాల్చివేత

Published Mon, Jan 4 2021 5:08 AM | Last Updated on Mon, Jan 4 2021 5:36 AM

 Gunmen kill 11 minority Shiite coal miners in SW Pakistan - Sakshi

మృతదేహాల వద్ద స్థానికుల నివాళి

కరాచీ: అల్పసంఖ్యాక వర్గాల ప్రజలే లక్ష్యంగా పాకిస్తాన్‌లో దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా, మైనారిటీ షియా హజారా వర్గానికి చెందిన 11 మంది గని కార్మికులను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. బలూచిస్తాన్‌ ప్రావిన్సు క్వెట్టాలోని మాచ్‌ బొగ్గుగని వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు గని కార్మికులు ఆదివారం ఉదయం విధులకు వెళ్తుండగా సాయుధ దుండగులు వారిని బెదిరించి, సమీపంలోని కొండ ప్రాంతానికి తీసుకెళ్లారు. అందులో మిగతా వారిని వదిలేసి, హజారా వర్గం కార్మికులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనకు ఎవరూ బాధ్యత ప్రకటించుకోలేదు. సున్నీ తీవ్రవాద సంస్థ లష్కరే జంఘ్వి గతంలో బలూచి స్తాన్‌లోని మైనారిటీ హజారా వర్గంపై పలు మార్లు దాడులకు పాల్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement