ప్రైవేటు చేతికి విమానాశ్రయాలు | airports to be privatised | Sakshi
Sakshi News home page

ప్రైవేటు చేతికి విమానాశ్రయాలు

Jan 24 2015 3:25 AM | Updated on Aug 20 2018 5:08 PM

దేశీయ విమానయాన రంగం ఆటుపోట్లతో నడుస్తోందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు చెప్పారు.

కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు
కురబలకోట: దేశీయ విమానయాన రంగం ఆటుపోట్లతో నడుస్తోందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు చెప్పారు. చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని రిషివ్యాలీ స్కూల్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విమానాశ్రయాల్లో ప్రపంచస్థాయి సౌకర్యాలను కల్పించేందుకు కొన్నింటిని ప్రైవేటీకరించాలని యోచిస్తున్నామన్నారు.

తొలుత నాలుగు విమానాశ్రయాలను ప్రైవేటు చేతికి అప్పగిస్తామని, ప్రస్తుతం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా చేతిలో ఉన్న దీసా, కేశోడ్ విమానాశ్రయాలను అప్పగించాలని కోరామని చెప్పారు. విమానాశ్రయాల్లో 50 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడానికి భారత్ సౌరవిద్యుత్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement