
పాదయాత్రలో సంజయ్‌తో లక్ష్మణ్, డీకే అరుణ
నవాబుపేట: విద్యా రంగాన్ని పూర్తిగా వ్యాపారం చేసిన సీఎం కేసీఆర్, ప్రైవేటు సంస్థలకు కొమ్ముకాస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఆదివారం గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా నవాబుపేట మం డలం మమ్మదాన్‌పల్లిలో ఆయన పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ..కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చడానికే విద్యాసంస్థలను ప్రారంభించారన్నారు. ఫీజులు వసూలు చేసుకోగానే విద్యా సంస్థలను మళ్లీ మూసివేస్తారని ఆరోపించారు. ఉన్న పాఠశాలలను మూసి వేసి, వాటి స్థానంలో కిలోమీటర్‌కో బార్ షాపును తెరుస్తున్న కేసీఆర్‌కు ఉపాధ్యాయులు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
తన తండ్రి ఉపాధ్యాయుడు కావడంతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేసుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చి శక్తిమంతమైన తెలంగాణను నిర్మించేందుకే పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన వంద మంది నాయకులు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్య«క్షురాలు డీకే అరుణ, మాజీ మంత్రి చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment