ఈ ‘వేతన ఒప్పందం’ ఆర్టీసీ ప్రైవేటీకరణకు సాధనమా? | is rtc going to privatiasation.. | Sakshi
Sakshi News home page

ఈ ‘వేతన ఒప్పందం’ ఆర్టీసీ ప్రైవేటీకరణకు సాధనమా?

Published Sat, May 16 2015 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

ఈ ‘వేతన ఒప్పందం’ ఆర్టీసీ ప్రైవేటీకరణకు సాధనమా?

ఈ ‘వేతన ఒప్పందం’ ఆర్టీసీ ప్రైవేటీకరణకు సాధనమా?

ఆర్టీసీ కార్మికవర్గానికి సంబంధించి ఈ బుధవారం (మే 13) సాయంత్రం వెల్లివిరిసిన విజయోత్సవాలలో భావి విషాదం ఏదైనా పొంచి ఉందా? ఈ తాజా ‘మంచి వేత న ఒప్పందం’ మున్ముందు ఆర్టీసీ సంస్థపట్ల సెలైంట్ కిల్ల ర్ పాత్రను పోషించనున్నదా?

ఆర్టీసీ కార్మికవర్గానికి సంబంధించి ఈ బుధవారం (మే 13) సాయంత్రం వెల్లివిరిసిన విజయోత్సవాలలో భావి విషాదం ఏదైనా పొంచి ఉందా? ఈ తాజా ‘మంచి వేత న ఒప్పందం’ మున్ముందు ఆర్టీసీ సంస్థపట్ల సెలైంట్ కిల్ల ర్ పాత్రను పోషించనున్నదా? కుడిచేతితో ఘనమైన ఆర్థిక  విజయాన్ని అందించి ఎడమచేతితో ప్రైవేటీకరిం చే లక్ష్యం ప్రభుత్వాలకు ఉందా? తాజా వేతన ఒప్పం దం జరిగిన తీరుతెన్నులు, ఇలాంటి అనుమానాలకు తావిస్తున్నాయి. ఎందుకంటే తొలి ఏడు రోజులూ ఉభ య రాష్ర్ట ప్రభుత్వాలు సమ్మె అణచివేతకై ఒకే దిశలో పరస్పరం పోటీపడ్డాయి. ఎనిమిదో రోజు మాత్రం కార్మి కులతో జేజేలు కొట్టించుకునేందుకు పోటీపడ్డాయి. కారణం ఏమిటి? కార్మికులు అడిగినంత శాతం జీతాలు పెంచిన చరిత్ర ఇటీవలి కాలంలో లేదు. ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె పట్ల ఇంతటి రాద్దాంతం చేసాక అడిగిన ఫిట్‌మెంట్ కొర్రీలు లేకుండా ఇవ్వడం ఊహకు కూడా సాధ్యం కాని విషయం. అడిగినదానికంటే ఒక శాతం ఎక్కువగా (44%) కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించడం అనూహ్యమే. ఉదారవాద విధానాల ప్రభుత్వాలు ఇలాంటి ‘ఉదారబుది’్ధని ప్రదర్శించడంలో రహస్య రాజకీయ ఎజెండా ఉందా?

 అత్యంత విలువైన వేలాది ఎకరాల పట్టణ ప్రాంత స్థలాలూ, నిర్మాణాలూ, వందలాది బస్టాండ్‌లూ, భారీ కాంప్లెక్సులూ, 23 వేల బస్సులతో దాదాపు రూ.50 వేల కోట్ల మార్కెట్ విలువతో వర్ధిల్లుతున్న ఆర్టీసీ సంస్థపై చంద్రబాబు సర్కారు విషపు చూపులు ఈనాటివి కాదు. 1995-2004 మధ్య చంద్రబాబు సర్కారు చేపట్టిన ప్రైవేటీకరణ ప్రక్రియ తెలిసిందే . ఆల్విన్, ఏపీ స్కూటర్స్ నుంచి సహకార రంగ నూలు చక్కెర మిల్లుల వరకు ఇలాంటి అప్పగింత పని సాగింది. కానీ ఆర్టీసీ అప్పగిం తలో విజయుడు కాలేకపోయాడు.

ముఖ్యంగా 2001 అక్టోబర్ నాటి 24 రోజుల ఆర్టీసీ కార్మికవర్గ సమ్మె చంద్ర బాబు సర్కారు ప్రైవేటీకరణ దూకుడుకు కళ్లెం వేసింది. నాడు మిస్సయిన ప్రైవేటీకరణ బస్సు ప్రయాణం చేయ డానికి చంద్రబాబుకు తగిన సమయమిది. ఇక కొత్త ఊపులో ఉన్న కేసీఆర్ ప్రభుత్వానికీ ప్రైవేటీకరణ ‘అంట రాని’ విషయమేమీకాదు. ఆర్టీసీని ప్రైవేటీకరించే దీర్ఘకా లిక వ్యూహాన్ని పాలకులు పలు పద్ధతుల్లో చేస్తూ వస్తు న్నారు. ఇప్పుడు నగర ఆర్టీసీని, గ్రామీణ ఆర్టీసీని వేరు పర్చి అత్యధిక లాభదాయికత కల నగర ఆర్టీసీ కార్పొరే షన్‌ను ప్రైవేటీకరించడం, నష్టాలొస్తున్న గ్రామీణ ఆర్టీ సీని మరింతగా నష్టాల పాలుచేసి అంతిమంగా ప్రైవేటీ కరించడం... ఇదీ ఇప్పుడు నూతన వ్యూహం.
 కార్మికులతో బుధవారం జై కొట్టించుకున్న చంద్ర బాబు సర్కారు ‘ఆదరణ’ను గంటలోనే కేసీఆర్ సర్కారు మిగలకుండా చేసింది. ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు చేకూరనున్న 1. సమ్మె కాలానికి జీతాల చెల్లింపు, 2. రెండేళ్ల ఎరియర్స్‌ను వాయిదాలుగా నగదు రూపంలో చెల్లింపు, 3. ఒప్పంద (కాంట్రాక్టు) కార్మికుల సర్వీసుల క్రమబద్ధీకరణ 4. ఒక శాతం అదనంగా ఫిట్ మెంట్ చెల్లింపు అనే నాలుగు అదనపు రాయితీలను బాబు అమలు చేయనంత కాలం ఏపీఎస్‌ఆర్టీసీ కార్మిక వర్గంలో అసంతృప్తి కొనసాగుతుంది.

అడిగినంత ఫిట్ మెంట్‌ను కష్టకాలంలో కూడా ఇచ్చిందన్న పేరు పొంద డం ద్వారా తమ నూతన ప్రైవేటీకరణ వ్యూహానికి ఆటం కం లేని పరిస్థితిని కల్పించుకుందామని బాబు పథకం పన్ని ఉండొచ్చు. కానీ కేసీఆర్ ప్రభుత్వం సృష్టించిన సం క్షోభాన్ని పరిష్కరించనంత కాలం బాబు వ్యూహం ఫలించకపోవచ్చు. ఈ మాయాజూదంలో బాబు ఎలా ముందుకు సాగుతాడన్నది వేచి చూడాల్సిందే.
 ‘ఆర్టీసీ పరిరక్షణ’కై రెండు దశాబ్దాలకు పైగా పోరా డుతూ వస్తున్న చరిత్ర ఆర్టీసీ కార్మిక వర్గానికి ఉంది. వారి నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనను మొద్దుబార్చ కుండా ప్రైవేటీకరణ చేయలేని పరిస్థితి ప్రభుత్వాలకి ఉంది. అలాగని రెండు ప్రభుత్వాలకు దన్నుగా ఉన్న ఆర్థిక ప్రాబల్యశక్తులను సంతృప్తిపరచడానికి ఆర్టీసీ ప్రైవే టీకరణను ఆపలేని పరిస్థితి కూడా ఉంది. అందుకే ఒక పథకం ప్రకారం అణచివేత, పోటీ బస్సుల రవాణా ద్వారా సమ్మెను విచ్ఛిన్నం చేయగల సామర్థ్యం తమకు ఉందని ఆర్టీసీ కార్మిక వర్గానికి ఒకవైపు సంకేతాన్ని పం పించి, మరోవైపు హఠాత్తుగా అనూహ్యమైన మెరుగైన వేతన ఒప్పందాన్ని అంగీకరించాయి. మీరు అడిగిన వేతన ఒప్పందాన్ని చేసి పెట్టాం. ఆర్టీసీలో మా ప్రభు త్వం ప్రవేశపెట్టే నూతన సంస్కరణలకు సహకరిం చండి’ అంటూ కార్మికులకూ, ఆర్టీసీ యూనియన్లకూ ఉదార విజ్ఞప్తులు చేసే అర్హతను ఈ వేతన ఒప్పందం ద్వారా ప్రభుత్వాలు సాధించజూస్తున్నాయి.

ఒక మెరు గైన ఆర్థిక విజయం ద్వారా ఆర్టీసీ కార్మిక వర్గాన్ని సంతృ ప్తిపరచి, మరోవైపు ఆర్టీసీ ప్రైవేటీకరణకు ‘రాజకీయ ప్రక్రియ’ను సాగించే ప్రయత్నాలున్నాయి. అయితే ఆర్టీసీ పరిరక్షణ కోసం అనేక పోరాటాలు సాగించిన ఉజ్వల చరిత్ర గల కార్మిక వర్గం ఇలాంటి వ్యూహాత్మక పథకాలను తిప్పికొడతారని ఆశిద్దాం. ఆరు దశాబ్దాల చరిత్రగల ఆర్టీసీ సంస్థను ప్రభుత్వాల ప్రైవేటీకరణ జూదంలో పావుగా మారనివ్వకుండా ప్రజలూ, కార్మిక వర్గమూ ఐక్యతతో కాపాడుకుంటారని ఆకాంక్షిద్దాం.

 (పి.ప్రసాద్, ఐ.ఎఫ్.టి.యు జాతీయ కార్యదర్శి)
 మొబైల్: 9490700715

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement