సాక్షి, న్యూఢిల్లీ : రైల్వేల ప్రైవేటీకరణకు మోదీ సర్కార్ చొరవపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ చర్యను ప్రజలు ఎన్నటికీ క్షమించబోరని రాహుల్ గురువారం వ్యాఖ్యానించారు. ‘పేదలు, సామాన్యులకు జీవనాడి వంటి రైల్వేలను ఇప్పుడు వారికి దూరం చేస్తున్నారని..దీనికి ప్రజలు మీకు దీటైన సమాధానం ఇస్తార’ని రాహుల్ ట్వీట్ చేశారు.
కాగా 109 రూట్లలో 151 రైళ్లను నడిపేందుకు రైల్వేలు ప్రైవేట్ ఆపరేటర్లను ఆహ్వానించడం పట్ల విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. భారత రైల్వే వ్యవస్థలో ప్రయాణీకుల రైళ్లను నడిపేందుకు ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించడం ఇదే తొలిసారని రైల్వే మంత్రిత్వ వాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయంతో రైల్వేల్లో 30,000 కోట్ల రూపాయల ప్రైవేట్ పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment