సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు ఇది సరైన సమయం కాదని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి నివేదించనుంది. ఎయిర్ ఇండియా రుణాలను రద్దు చేసి పునరుద్ధరణకు ప్రయత్నించాలని సూచించింది. ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియాలో మూలధన సమీకరణ దశలవారీగా చేపట్టడంతో సంస్థ ఆర్థిక, నిర్వహణా సామర్థ్యం దెబ్బతిని అధిక వడ్డీలకు రుణాలకు వెళ్లే పరిస్థితి నెలకొందని పేర్కొంది. ఎయిర్ ఇండియా విక్రయ ప్రతిపాదనను ప్రభుత్వం పునఃసమీక్షించాలని జాతికి గర్వకారణమైన ఎయిర్ ఇండియాను కాపాడేందుకు ప్రత్యామ్నాయం ఆలోచించాలని రవాణా, పర్యాటక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది.
ప్రకృతి వైపరీత్యాలు, భారత్‌లో..విదేశాల్లో సామాజిక, రాజకీయ అశాంతి తలెత్తిన సందర్భాల్లో ఎయిర్ ఇండియా తన వంతు సేవలు అందించిందని కొనియాడింది. ఎయిర్ ఇండియా పనితీరును నీతి ఆయోగ్ చేసిన మాదిరి కేవలం వాణిజ్య కోణంలోనే బేరీజు వేయడం సరికాదని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment