సాక్షి,ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఉక్కు పరిరక్షణ సమితి పేర్కొంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలని డిమాండ్ చేసింది. శనివారం ఉక్కు పరిరక్షణ సమితి నేతలు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం కొత్త పరిశ్రమలు ఇవ్వకుండా ఉన్న పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కి మణిహారంలాంటి విశాఖ స్టీల్‌ను కాపాడుకోవాలని పేర్కొన్నారు. రూ.వేలకోట్ల విలువైన విశాఖ స్టీల్‌ను చౌకగా అమ్మేస్తున్నారని, స్టీల్‌ప్లాంట్ అంశంపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని విపక్షాలను కోరతామని చెప్పారు. తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని, పార్లమెంటరీ పార్టీ నాయకులు స్టీల్ ప్లాంట్ సమస్యకు మద్దతు పలికారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment