![రైల్వేలను ప్రైవేటీకరించం: మోదీ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/41419459271_625x300_0.jpg.webp?itok=87E3gwLl)
రైల్వేలను ప్రైవేటీకరించం: మోదీ
వారణాసి: రైల్వేలను ప్రైవేటీకరించబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సుపరిపాలన దినోత్సవంలో భాగంగా గురువారం ఆయన తన నియోజకవర్గం వారణాసిల పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైల్వేల అభివృద్ధితో దేశమూ అభివృద్ధి చెందుతుందని అన్నారు. లక్షల మందికి రైల్వే ఉద్యోగాలు కల్పిస్తోందన్నారు.
దేశంలో 4 రైల్వే యూనివర్సిటీలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. భారతీయ రైల్వేలో 60 ఏళ్లుగా ఎలాంటి పురోగతి లేదన్నారు. కొద్దికాలంలోనే రైల్వేలను అభివృద్ధి చేస్తామన్నారు. 'మేకిన్ ఇండియా' దిశగా యువతను ప్రోత్సహిస్తామని మోదీ అన్నారు.