
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ యూనిట్లలో పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగే ప్రక్రియేనని.. ఈ జాబితాలో కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) కూడా ఉందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలియజేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సభ్యుల ప్రశ్నకు స్పందిస్తూ మంత్రి సమాధానం ఇచ్చారు.
కాంగ్రెస్ మొదలు పెట్టింది
కాంకర్‌లో పెట్టుబడుల ఉపసంహరణ అన్నది 1994–95 కాంగ్రెస్ పాలనలోనే మొదలైనట్టు మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే రైల్వే మంత్రిగా ఉన్న సమయంలోనూ కాంకర్‌లో పెట్టుబడుల విక్రయానికి ప్రయత్నించినట్టు గుర్తు చేశారు. ‘1994–95లో కాంకర్‌లో 20 శాతం వాటాను విక్రయించారు. 995–96లోనూ కాంగ్రెస్ సర్కారు మరో 3.05 శాతం వాటాను విక్రయించింది. కాంగ్రెస్ హయాంలో కాంకర్‌లో మొత్తం 24.35 శాతం వాటాను విక్రయిస్తే.. కాంగ్రెసేతర ప్రభుత్వాలు 20.3 శాతం వాటాను విక్రయించాయి’’ అని సభ ముందు వివరాలు ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment