
ముంబై: వేగవంతంగా, ఒక్కసారిగా పెద్ద ఎత్తున చేపట్టే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ ప్రైవేటీకరణ మంచికన్నా ఎక్కువ చెడు పరిణామాలకే దారితీస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బులిటిన్‌లో జారీ అయిన ఆర్టికల్స్ రచయితలు అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ అంగీకరించాల్సిన అవసరం లేని ఈ ఆర్టికల్ అభిప్రాయాల ప్రకారం, ఒక క్రమ పద్దతిలో మంచి, చెడులను పరిగణనలోకి తీసుకుంటూ ఆచితూచి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ ప్రైవేటీకరణ జరిగితే తగిన మెరుగైన ఫలితాలను చూడవచ్చు. ఈ పక్రియ హడావిడిగా జరగడం ఎంతమాత్రం సరికాదు.
ప్రభుత్వం అనుసరించే ప్రైవేటీకరణ విధానం సామాజిక లక్ష్యాన్ని నెరవేరుస్తుందో లేదో జాగ్రత్తగా పరిశీలించాలని ఆర్టికల్ సూచించింది. అందరికీ బ్యాంకింగ్‌లో భాగస్వామ్యం ప్రధాన లక్ష్యంగా విలీన పక్రియ జరగాలని సూచించింది. 2020లో కేంద్రం 10 ప్రభుత్వ బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా విలీన ప్రక్రియను నిర్వహించింది. దీనితో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గింది. 2017లో మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి.
చదవండి: Emirates Airbus A380: ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానం.. మొదటిసారిగా ఆ నగరానికి!
Comments
Please login to add a commentAdd a comment