
న్యూఢిల్లీ: మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేసే దిశగా రెండు చట్టాలకు కేంద్ర ప్రభుత్వం త్వరలో సవరణలు చేయనుంది. బ్యాంకింగ్ కంపెనీల చట్టం (సంస్థల కొనుగోలు, ట్రాన్స్‌ఫర్) 1970, బ్యాంకింగ్ కంపెనీల చట్టం 1980లో నిర్దిష్ట సవరణలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటి ఆధారంగానే పలు ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేశారని, ప్రైవేటీకరణ చేయాలంటే వీటిలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వివరించాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సవరణలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. 2021–22 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పీఎస్‌బీల ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. చదవండి: (టాటా ‘బిగ్‌బాస్కెట్ ’డీల్!)