సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రైవేటీకరించని పక్షంలో అది మూతపడుతుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. ఎయిరిండియాను ప్రైవేటీకరించకుంటే దాన్ని నడిపేందుకు నిధులను ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆయన ప్రశ్నించారు. ఎయిరిండియా విలువైన ఆస్తి అని దాన్ని విక్రయించదలుచుకుంటే మెరుగైన బిడ్డర్లు ముందుకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. మనం సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ మడి కట్టుకుని కూర్చుంటే ఎయిరిండియాను నడపడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. రాజ్యసభలో మాట్లాడుతూ పౌర విమానయాన మంత్రి హర్దీప్ పూరి ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment