సాక్షి, రాజమండ్రి: గత కొద్దిరోజులుగా అధికార టీడీపీ, బీజేపీ పార్టీ నాయకులు ఒక్కరినొక్కరు విమర్శించుకోవడం తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ టీడీపీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ ఉద్దేశ పూర్వకంగానే రాజకీయాల కోసం బీజేపీని టార్గెట్ చేస్తోందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రకరమైన పరిస్థితి నెలకొందన్నారు. ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీలో చేరి మంత్రులు అయిపోతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడుతున్నారు. ఆ ట్రాప్‌లో సీఎం చంద్రబాబు నాయుడు పడరని అనుకుంటున్నాను. అంతేకాక బీజేపీలో సీరియస్ రాజకీయాలు చెయ్యాలి.. కాజువల్ మాటలు సరికాదని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment