రాజమండ్రి : కాపు సామాజిక వర్గం నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను రక్షించుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం రాజమండ్రిలో ఆకుల సత్యనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ... ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. మా డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముద్రగడ వైపు నుంచి కూడా మేము అన్ని ప్రయత్నాలు చేస్తామని ఆకుల సత్యనారాయణ చెప్పారు.