రాజమండ్రిలో వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లకోసం సన్నాహాలు ప్రారంభించినట్టు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు.
హైదరాబాద్: రాజమండ్రిలో వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లకోసం సన్నాహాలు ప్రారంభించినట్టు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ దీనిపై ఇప్పటికే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతోపాటు రైల్వేమంత్రిని కలిశామని చెప్పారు.
రాజమండ్రి, కొవ్వూరుల్లో కల్పించాల్సిన సదుపాయాలపై వారంలోగా నివేదిక ఇవ్వాలని వారు సంబంధిత అధికారుల్ని ఆదేశించారని వివరించారు. రాజమండ్రిలోని అగ్రికల్చరల్ కాలేజీకి భూమి కేటాయింపు అంశం రెండేళ్లుగా కేంద్ర కేబినెట్ అనుమతికోసం పెండింగ్‌లో ఉండగా... మోడీ సర్కారు ఈ నెల 17న ఈ భూమిని కాలేజీకి అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చిందని ఆయన తెలిపారు.