
టీడీపీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్
రాజమండ్రి: టీడీపీ నేతలపై రాజమండ్రి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమది నీతి, నిజాయితీలతో కూడిన పార్టీ అని.. ఈ విషయం తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
గురువారం ఉదయం రాజమండ్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం టీడీపీ నేత బాబూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలుసుకుని మాట్లాడాలని రాజేంద్రప్రసాద్ అనటం సరికాదన్నారు. తమకు టీడీపీ నాయకులు హితభోద చేయాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించటంపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత టీడీపీ దేనని చెప్పారు.
టీడీపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు పార్టీ పరంగానా, వ్యక్తిగతమా అనేది స్పష్టం చేయాలని రాజేంద్రప్రసాద్ బుధవారం డిమాండ్ చేశారు.