ఏపీ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా రాజు | Vishnu Kumar Raju elected as BJP's floor leader in AP assembly | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా రాజు

Published Thu, Jun 26 2014 8:12 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 AM

Vishnu Kumar Raju elected as BJP's floor leader in AP assembly

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఎంపికయ్యారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను పార్టీ విప్‌గా నియమితులయ్యారు. మంగళగిరిలో గురువారం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కె. హరిబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర శాసనసభలో బీజేపీకి నలుగురు సభ్యుల బలం ఉంది. వీరిలో ఎమ్మెల్యే మాణిక్యాలరావు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌లకు టీడీపీ మంత్రివర్గంలో పదవులు దక్కాయి.

ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు సందర్భంగా ఇచ్చిన హామీల అమలకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని సమావేశం ముగిసిన తర్వాత హరిబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం సాయం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement