
సాక్షి, మదనపల్లె : తిరుపతి– మదనపల్లె ఫోర్‌లేన్ రోడ్డుకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు ఆహ్వానించింది. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కృషి ఫలించింది. ఇటీవల ఆయన కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో సమావేశమై ఎన్‌హెచ్–71 నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరడంతో ప్రక్రియ ప్రారంభమైంది. మదనపల్లె నుంచి చెర్లోపల్లె (తిరుపతి) వరకు 103 కిలోమీటర్ల రహదారిలో తొలిదశగా రూ.1,474.54కోట్ల అంచనా వ్యయంతో మదనపల్లె–పీలేరు మధ్య 55.90 కిలోమీటర్ల రోడ్డు నిర్మించనున్నారు.
డిజైన్, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (డీబీఓటీ) విధానంలో రహదారి నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు నిర్ణయించారు. ఎన్‌హెచ్‌ఏఐ పోర్టల్‌లో ఈ–ప్రొక్యూర్‌మెంట్ పద్ధతిలో డిసెంబర్ 13 లోపు ఈ–టెండర్లు దాఖలు చేయాలని కోరారు. డిసెంబర్ 14న టెండర్లను ఖరారు చేసి వచ్చే ఏడాది జనవరి నుంచి రోడ్డు నిర్మాణం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నా రు. ఫోర్‌లేన్ రోడ్డు మంజూరుకు చొరవ చూపిన ఎంపీ మిథున్‌రెడ్డికి ఎమ్మెల్యే నవాజ్‌బాషా కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: (రైల్వే స్టేషన్‌లో పేలుడు.. నలుగురు జవాన్లకు తీవ్రగాయాలు)
Comments
Please login to add a commentAdd a comment