ఆంధ్రుల ఆత్మ గౌరవానికి.. ఢిల్లీ అహంకారానికి పోరాటం | MP Mithun Reddy clarifies on ysrcp mps resignations | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 15 2018 4:26 PM | Last Updated on Thu, Mar 21 2024 10:57 AM

ప్రత్యేక హోదా సాధన కోసం మా పార్టీ ఎంపీలం రాజీనామాలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ రాద్ధాంతం చేయడం మంచిది కాదని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. గతంలో మమ్మల్ని రాజీనామాలు చేయలేదని అడిగారు.. ఇప్పుడు రాజీనామాలు చేస్తే ఎన్నికలు రావని వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. రాజీనామాలతో వచ్చే ఉప ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య పోరాటంగా అభివర్ణించారు. ప్రత్యేక హోదానా.. ప్రత్యేక ప్యాకేజీనా అనేది ప్రజల్లోనే తేల్చుకుందాం రమ్మన్నారు. వివక్షతో కళ్లు మూసుకుపోతే వారికి ఏం ప్రయోజనాలు కనిపించవు. మమ్మల్ని విమర్శించే వాళ్లు జూన్ 4, 2019 వరకూ 15 నెలలపాటు ఎంపీలుగా కొనసాగే అవకాశం ఉన్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొన్న విషయాన్ని మిథున్ రెడ్డి గుర్తుచేశారు. అన్నీ తానే చేశానని చెప్పుకునే చంద్రబాబు మాకు మాత్రం ఓ సాయం చేయాలి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement