మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాకు చెందిన కె.వి.భాస్కర్‌నాయుడుతో సహా పలువురు నేతలు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు.
హైదరాబాద్: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాకు చెందిన కె.వి.భాస్కర్‌నాయుడుతో సహా పలువురు నేతలు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని పెద్దసంఖ్యలో చిత్తూరు నేతలు, కార్యకర్తలు ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఆయన వారిని పార్టీలో చేర్చుకున్నారు.
సత్యవేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు భాస్కర్‌నాయుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటుగా పార్టీలో చేరినవారిలో కె.కైలాష్‌రెడ్డి(పిచ్చాటూరు మాజీ ఎంపీపీ), ముద్దుకృష్ణమరాజు(మాజీ జడ్పీటీసీ)తో సహా పలువురు ఉన్నారు. జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ నారాయణస్వామి, సత్యవేడు అసెంబ్లీ కోఆర్డినేటర్ ఆదిమూలం, జిల్లా ట్రేడ్‌యూనియన్ నాయకుడు బీరేంద్రవర్మ వారితో ఉన్నారు.