చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస‍్యల కోసం నిరంతరం పోరాడుతున్న ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీలోకి రోజు రోజుకీ చేరికలు పెరుగుతున్నాయి. తాజాగా పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వంద మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు.
దీనిలో భాగంగా మాట్లాడిన రామచంద్రారెడ్డి.. అన్ని ప్రాంతాల్లో బీసీ అధ్యయన సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తమ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తర్వాత బీసీ గర్జనను ఏర్పాటు చేస్తామన్నారు.