
సమావేశంలో మట్లాడుతున్న ఎమ్మెల్యే రోజా
నగరి(నిండ్ర): నియెజగవర్గంలో టీడీపీ పాలనలో ఎలాంటి అబివృద్ధి జరగలేదని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. వైఎస్సార్‌సీపీ నగరి బూత్ కమిటీ సమావేశంలో ఆమె మట్లాడుతూ నగరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు అధికార పార్టీ అడ్డుపడుతోందని విమర్శించారు. నగరి పట్టణంలో ఎలాంటి కార్యక్రమం చేపట్టాలన్నా అధికారులు, పార్టీ నాయకులు అడ్డుపడుతున్నారని తెలిపారు. నగరి వైద్యాశాల వద్ద బస్సు షెల్టర్ నిర్మాణం, తాగునీటి ఆర్‌ఓ ప్లాంట్ల నిర్మాణానికి, మండలంలో ఎంపీ విజయసాయి రెడ్డి నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి టీడీపీ సర్పంచ్‌లు అనుమతి ఇవ్వలేదని, పుత్తూరు మండలంలోను ఇదే సమస్యగా ఉం దని తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అవినీతి పాలన చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని, ఇక ప్రజ లు ఆయన్ను నమ్మే స్థితిలో లేరని చెప్పారు. ప్రత్యేక హోదా విషయాన్ని బంగాళాఖాతంలో కలిపిన సీఎంగా పేరుతెచ్చుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోయినా తన వంతు ప్రజలకు సహాయం చేయడం తనకెంతో గర్వంగా ఉందని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకులు కేజే కుమార్, చంద్రారెడ్డి, బుజ్జిరెడ్డి, తిరుమల రెడ్డి, హరిహరన్, సుధాకర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, పరుశురామ్, కృష్ణమూర్తి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment