సీఎం పదవిచ్చినా ఆయన పార్టీ మారరు | ysrcp mla kalathur narayana swamy slams tdp | Sakshi
Sakshi News home page

సీఎం పదవిచ్చినా ఆయన పార్టీ మారరు

Published Mon, Apr 18 2016 8:55 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

సీఎం పదవిచ్చినా ఆయన పార్టీ మారరు - Sakshi

సీఎం పదవిచ్చినా ఆయన పార్టీ మారరు

వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి

తిరుపతి: ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్నా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీలోకి వెళ్లే ప్రసక్తే ఉండదని పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి అన్నారు.

ఆదివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చిత్తూరు జిల్లా టైగర్‌గా అభివర్ణించారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయినప్పటికీ ఇక్కడ పట్టుసాధించలేకపోయారన్నారు. దాంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టీడీపీలోకి లాక్కొంటే తప్ప జిల్లాలో పట్టుసాధించలేమని భావించి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీలోకి వస్తున్నారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. అయితే అటు సూర్యుడు ఇటు పొడిచినా అది సాధ్యం కాదన్నారు. 

టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే జగనన్న ఫోటోతో గెలిచిన ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు.  జలీల్‌ఖాన్‌కు రాబోయే ఎన్నికల్లో మైనార్టీలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement