
‘చంద్రబాబు అలా చెప్పడం సిగ్గుచేటు’
కరువు పట్ల చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు.
తిరుపతి: రాయలసీమలో కరువు తాండవిస్తున్నా సీఎం చంద్రబాబుకు పట్టడం లేదని వైఎస్సార్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరువు పట్ల చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కరువును జయించామని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. నారా లోకేశ్ మంత్రి అయినా చిత్తూరు జిల్లాకు జరిగిందేమీ లేదని తెలిపారు.