సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఇటీవల టీడీపీ నేతల బెదిరింపులు, ఒత్తిళ్లకు తలొగ్గి ఆ పార్టీలో చేరిన చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, పలువురు కౌన్సిలర్లు తిరిగి సోమవారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. తల్లి లాంటి వైఎస్సార్‌సీపీ కుటుంబాన్ని వదిలి తప్పుచేశానని, అక్రమ కేసులు పెడతామని భయపెట్టడంవల్ల ఆత్మసాక్షిని చంపుకుని టీడీపీలో చేరామని వారు వెల్లడించారు. తమ తప్పు తెలుసుకుని తిరిగి పారీ్టలో చేరుతున్నట్లు అలీం బాషా తెలిపారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కుటుంబంతోనే ఉంటామని వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము స్పష్టంచేశారు.
వరద బాధితులకు హెలికాప్టర్ ఎందుకు పంపలేదు?
ఈ సందర్భంగా ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాసమస్యలు గాలికొదిలేసి, డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆరోపించారు. మదనపల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అగి్నప్రమాదం జరిగితే.. కావాలనే ఫైల్స్ అన్నీ కాల్చేశారని, ఏమీ జరక్కపోయినా ఏదో జరిగిపోయినట్లు నానాయాగీ చేసి హెలికాప్టర్‌లో డీజీపీ, సీఎస్‌ని పంపించారని ఎంపీ గుర్తుచేశారు.
కానీ, ఇప్పుడు అంతకన్నా ముఖ్యంగా వరదల్లో ప్రజలు చిక్కుకుని విలవిల్లాడుతుంటే హెలికాప్టర్ పంపి వారినెందుకు రక్షించటంలేదని మిథున్‌రెడ్డి చంద్రబాబుని ప్రశి్నంచారు. అలాగే, గుడ్లవల్లేరు ఘటనలో ఆడబిడ్డల తరఫున నిలబడాల్సిన ప్రభుత్వం నిందితులను కాపాడేందుకు ప్రయతి్నస్తుండడంపై మండిపడ్డారు. కళాశాలలో చదువుకునే విద్యార్థినులు భయంతో వణికిపోతుంటే.. వారికి ధైర్యం చెప్పి నిందితులను కఠినంగా శిక్షించాల్సింది పోయి.. ఏమీ జరగలేదని తండ్రీకొడుకులు ప్రకటించటం న్యాయమేనా? అని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment