కలకడ, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జై సమైక్యాంధ్ర, తెలుగుదేశం నాయుకులు, వూజీ సర్పంచ్, ఎంపీటీసీ వూజీ సభ్యులు చేరారు. ఆదివారం వుండలంలో వైఎస్‌ఆర్ సీపీ ఇంటింటి ప్రచారం కార్యక్రవూనికి హాజరైన ఆ పార్టీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పీలేరు అసెంబ్లీ అభ్యర్థి చింతల రావుచంద్రారెడ్డి సవుక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
వుండలంలోని నడిమిచెర్ల పంచాయుతీకి చెందిన వూజీ సర్పంచ్ లింగాల రాజారెడ్డి తన అనుచరులు వంద వుందితో చేరారు. ఆయున వెంట ఎంపీటీసీ వూజీ సభ్యుడు భవానీ పార్టీలో చేరినవారిలో ఉన్నారు. కోన పంచాయుతీకి చెందిన వూజీ వార్డు సభ్యుడు బి.వెంకటరవుణ ఆధ్వర్యంలో తెలుగుదేశం నుంచి 50 వుంది కార్యకర్తలు వైఎస్‌ఆర్ సీపీలో చేరారు.
అనంతరం మిథున్‌రెడ్డి వూట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేవు పథకాలు తిరిగి అవులు కావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వుుఖ్యవుంత్రి కావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం, జై సమైక్యాంధ్ర పార్టీలు కుమ్మక్కు రాజకీయూలతో ప్రజల వద్దకు వస్తున్నట్లు ఆరోపించారు. చంద్రబాబు రోజుకోవూట, పూటకో వేషం వేసి ప్రజలను వుభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇచ్చిన వూట నిలబెట్టుకునేది ఒక్క వైఎస్ కుటుంబమేనన్నారు. ఉదయుం గుర్రంకొండ వుండలం రావూపురం వూజీ సర్పంచ్ ఆకుల రెడ్డెప్ప తన అనుచరులు వందవుందితో చేరారు. బాబురెడ్డి, సుబ్బారెడ్డి, నాగభూషణ్, రాజశేఖరాచారి, రాజశేఖర్‌రెడ్డి, షఫీ, లింగాల వెంకట్రవుణరెడ్డి, వెంకటశేషురెడ్డి, ఎ.శివారెడ్డి, ఎ.రంగారెడ్డి, ఎం.నల్లపాపిరెడ్డి, కోన గ్రావుం నుంచి నాగరాజ, గురుస్వామి, వెంకట్రవుణ తదితరులు చేరిన వారిలో ఉన్నారు.
వైఎస్‌ఆర్ సీపీలోకి భారీగా వలస
Published Mon, Apr 21 2014 3:53 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
Advertisement
Advertisement