
'ఫించన్లు ఇవ్వని ఘనత చంద్రబాబుదే'
చిత్తూరు: అర్హులైన వారికి ఫించన్లు ఇవ్వని ఘనత చంద్రబాబు సర్కారుకే చెందుతుందని వైఎస్ఆర్ సీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి విమర్శించారు. కనీసం తాగునీరు ఇచ్చే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదని ఆయన ధ్వజమెత్తారు. సీఎం సొంత జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.
నిరుద్యోగ భృతి, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ గాలికొదిలేశారని విమర్శించారు. జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజలే అడ్డుకుంటున్నారని మిథున్రెడ్డి తెలిపారు.