మాట్లాడుతున్న మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
వైఎస్‌ఆర్ జిల్లా, నందలూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడం, అలాగే రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన భాధ్య త కూడా మనందరిపై ఉందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక గొబ్బిళ్ల శంకరయ్య మెమోరియల్ పాఠశాల ఆవరణలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు సిద్దవరం గోపిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మిథున్‌రెడ్డితో పాటు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డిలు హాజరయ్యారు.ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలను ,అసత్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి చెప్పినట్లు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తదేనన్నారు.
ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఆదుకుంటామన్నారు. నీతి నిజాయితీకి మారుపేరు వైఎస్సార్‌సీపీ అన్నారు. రానున్నది జగనన్న రాజ్య మని ప్రతిఒక్కరికీ అండగా ఉంటూ తమ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ... తాను మొదటి నుంచి దివంగతనేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం మనిషినేనన్నారు. అనివార్య కారణాలవల్ల తెలుగుదేశం పార్టీలో కొనసాగానన్నారు. తిరిగి వైఎస్సార్‌సీపీలోకి రావడంతో తాను తన సొంతకుటుంబంలోకి వచ్చినట్లు సంతోషంగా ఉందన్నారు. ఆకేపాటి, మిథున్‌రెడ్డి సహాయసహకారాలతో నియోజకవర్గం అభివృద్దికి కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు సిద్దవరం గోపిరెడ్డి, గడికోట వెంకటసుబ్బారెడ్డి, నడివీధి సుధాకర్, గంపా సుధాకర్, గొబ్బిళ్ల త్రినాథ్, గుండు మల్లికార్జునరెడ్డి, పల్లె గ్రీశ్మంత్‌రెడ్డి, ఆకేపాటి జగదీశ్వర్‌రెడ్డి, గుండు గోపాల్‌రెడ్డి, అరిగెల సౌమిత్రి చంద్రనాథ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment