pileru constituency
-
అన్నమయ్య జిల్లా పీలేరులో వికేంద్రీకరణకు మద్దతుగా ర్యాలీ
-
పీలేరులో టీడీపీకి షాక్!
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ పీలేరు నియోజకవర్గానికి మాజీ ఇన్చార్జీ మైనార్టీ నేత ఇక్బాల్ మహమ్మద్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 20మంది నేతలు కూడా టీడీపీకి రాజీనామా చేశారు. పాతిక సంవత్సరాలు టీడీపీకి సేవ చేసి ఎంతో నష్టపోయామని ఇక్బాల్ వాపోయారు. 2014లో కిరణ్‌కుమార్ రెడ్డి కుటుంబం మీద పోటీచేయాలని తన మీద చంద్రబాబు ఒత్తిడి తీసుకవచ్చారని.. అందుకే పోటీచేశానన్నారు. అయితే ఎన్నికల తరువాత అన్నివిధాల ఆదుకొంటామని సీఎం రమేష్ కూడా హామీ ఇచ్చారని తెలిపారు. అంతేకాకుండా టీడీపీ అధికారంలోకి వచ్చాక క్యాబినేట్ పదవిని ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.. కానీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని అన్నారు. నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డిని టీడీపీలో చేర్చుకునేటప్పుడు తనకు నామినేటెడ్ పదవిని ఇస్తానని చెప్పిన చంద్రబాబు తరువాత పట్టించుకోలేదన్నారు. పైగా కిషోర్ కుమార్ రెడ్డికి ఇన్చార్జీ బాధ్యతలను ఇవ్వడమే కాకుండా.. కార్పోరేషన్ పదవిని కూడా ఇచ్చారన్నారు. సీఎంను కలిసి అనేక సార్లు తాను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పానన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాతే చంద్రబాబుకు ముస్లింల పట్ల ప్రేమ కనపడుతోందని విమర్శించారు. తన రాజీనామా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. -
బాబు అడుగడుగునా అడ్డుపడ్డారు
సాక్షి, పీలేరు : ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన మహానేత వైస్ రాజశేఖర్ రెడ్డి అని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని వాల్మికీపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లకు చంద్రబాబునాయుడు అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మైనార్టీలను వైఎస్సార్సీపీ దూరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, అందుకే వైఎస్ జగన్, బీజేపీతో కలిసాడని అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ బీజేపీతో కలవదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 100కు పైగా కుటుంబాలు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాయి. -
ఇన్నాళ్లూ ఏం చేస్తున్నారు?
సుమారు 4,600 ఎకరాల్లో గసగసాల సాగు రైతులను చైతన్య పరచని అధికారులు నిషేధం పేరుతో పంటొచ్చే దశలో ధ్వంసం దాదాపు రూ.15 కోట్ల పెట్టుబడులు మట్టిపాలు అన్నదాతకు అడుగడుగునా కష్టాలే. పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో ఆరేళ్ల నుంచి గసగసాల పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది పంట చేతికొచ్చే దశలో అధికారులు పంటను ధ్వంసం చేశారు. దీంతో సాగు కోసం రైతులు పెట్టిన పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. దీంతో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తూ చోద్యం చూస్తోంది. పోలీసు దాడులతో దిక్కుతోచక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తిరుపతి: పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లి, రామసముద్రం మండలాలతోపాటు సోమల మండలంలో కలిపి దాదాపు 1500 మంది రైతులు 4,600 ఎకరాల్లో పంట సాగు చేసినట్లు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అంచనా వేశారు. ఎకరాసాగు కోసం సరాసరిని రూ.30,000 ఖర్చు చేశారు. ఈ పంట సాగుకు కోసం అన్నదాతలు దాదాపు రూ.15 కోట్ల రూపాయలను పెట్టుబడి రూపంలో వెచ్చించారు. పంటను ఆరేళ్ల నుంచి మెయిన్ రోడ్డుల పక్కన, పుణ్యక్షేత్రమైన బోయకొండ సమీపంలోనే సాగు చేస్తున్నారు. అనునిత్యం ఎంతో మంది ఉన్నతాధికారులు పంటను చూస్తూ వెళ్లినా ఏనాడు పంట వేయవద్దని వారించలేదు. ఆభరోసాతోపాటు కొంతమంది వ్యాపారుల మోసపూరిత మాటలు నమ్మి రైతులు పంటను సాగు చేశారు. రెండు రోజులుగా ఎక్సైజ్ డీసీ సత్యప్రకాశ్, పలమనేరు డీఎస్పీ శంకరరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది పోలీసులు పంటను ధ్వంసం చేస్తూ అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. కొట్టొచ్చిన అధికారుల నిర్లక్ష్యం.. ఎక్సైజ్, వ్యవసాయ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిటి శాపంగా మారింది. చెన్నైలో కొకైన్ పట్టు పడటంతో ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఇది ఎక్కడి నుంచి సరఫరా ఆవుతుందని ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గసగసాల పంట, పొట్టు జిగురు నుంచి ఈ పదార్థాలు తయారవుతున్నాయని అనుమానం చ్చింది. దీంతో కొన్ని మొక్కలను పరిశీలనార్థం కేంద్ర కార్యాలయానికి పంపారు. చివరకు వారి అనుమానమే నిజమైంది. దీనిలో ఓపీయం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. అప్పుడు అధికారులు అప్రమత్తమయ్యారు. అంతవరకు దాదాపు ఆరేళ్ల పాటు నిద్ర మత్తులో జోగాయి. అధికారులు మందుజాగ్రత్తగానే దృష్టి సారించి ఈ పంట నిషేదిత పంట వేయకూడదని చైతన్య పరిచి ఉంటే అన్నదాతలు నష్టపోయి ఉండేవారు కాదు. దీనికితోడు రెవెన్యూ అధికారులు సైతం ఏ పంట సాగు చేసింది అడంగల్‌లో వివరాలను ఏటా నమోదు చేస్తారు. ఈ పంట వివరాలను సైతం సక్రమంగా నమోదు చేయలేదు. దీంతో రెవెన్యూ అధికారుల డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన కొంత పరిమిత విస్తీర్ణంలోనే దీన్ని సాగు చేస్తారు. ఇక్కడ ఈ పంట సాగు అవుతున్నా వ్యవసాయ శాఖ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించారు. కొన్ని శాఖల అధికారులకు మాముళ్లు అందటంతో ఇన్ని రోజులు చూసీ చూడనట్లు వదలి వేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
'పీలేరులో కిరణ్‌కు డిపాజిట్లు కూడా దక్కవు'
జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి శుక్రవారం తిరుపతిలో నిప్పులు చెరిగారు. సొంత నియోజకవర్గమైన పీలేరులో అభ్యర్థులను నిలబెట్టుకోలేని పరిస్థితి కిరణ్దంటూ ఆయన ఎద్దేవా చేశారు. అరాచక శక్తులతో వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవాలని కిరణ్ వర్గం ప్రయత్నిస్తుందంటూ ఆయన ఆరోపించారు. ఎన్ని దౌర్జన్యాలైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని మిథున్ రెడ్డి స్ఫష్టం చేశారు. పీలేరులో కిరణ్‌కు డిపాజిట్లు కూడా దక్కవని విమర్శించారు. కొన్ని మీడియా సంస్థలు కావాలని తమ పార్టీపై దుష్పచారం చేస్తున్నాయని మిథున్ రెడ్డి ఈ సందర్బంగా సదరు మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.