
సాక్షి,విశాఖపట్నం:యువతిపై ప్రేమోన్మాది దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ఈ మేరకు కళ్యాణి శుక్రవారం(ఫిబ్రవరి14) మీడియాతో మాట్లాడారు. ‘కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. యువతిపై యాసిడ్ దాడి చాలా దారుణం.
ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.యాసిడ్ బాధిత మహిళకు ప్రభుత్వం అండగా నిలబడాలి.యువతకు మెరుగైన వైద్యం అందించాలి.రాష్ట్రంలో మహిళల భద్రతను గాలికి వదిలేశారు.జనసేన నేత కిరణ్ రాయల్ వలన మహిళకు అన్యాయం జరిగితే తిరిగి అదే మహిళ మీద కేసు పెట్టారు’అని కళ్యాణి గుర్తుచేశారు.
