![Young Man Drowned In River In Annamayya District - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/21/SWIMMING.jpg.webp?itok=-whobZbE)
పీలేరురూరల్: ఈతకెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని జాండ్ల పంచాయతీ గుండాల మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం శ్రీనాథపురం కాలనీకి చెందిన షేక్ రియాజ్ కుమారుడు షేక్ సుహేల్ (18) తన స్నేహితుడు కట్టుకాలువ వీధికి చెందిన షేక్ మాలిక్ బాషా ఇద్దరూ పట్టణంలోని ఓ చికెన్ సెంటర్‌లో పని చేసేవారు. శనివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో సరదాగా ఈత కొట్టడానికి అడవిపల్లె గుండాల మల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలోని వాగు వద్ద వెళ్లారు.
పై నుంచి నీటిలో దూకాడు. నీటిలోపల ఉన్న రాళ్లలో ఇరుక్కుపోయాడు. ఎంతకు పైకిరాకపోవడంతో గట్టుపై ఉన్న మాలిక్ వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సుహేల్ నీటిలోని రాళ్లలో ఇరుక్కుని మృతి చెంది ఉండగా గుర్తించి వెలుపలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మోహన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment