
డాక్టర్ శిల్ప(పాత చిత్రం)
పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరులోని జాగృతి అపార్టుమెంటులో శిల్ప అనే జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఐదేళ్ల క్రితం రూపేశ్ కుమార్ అనే వ్యక్తితో శిల్పకు ప్రేమ వివాహం జరిగింది. శిల్ప, తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలోని పీడీయాట్రిక్ డిపార్టుమెంటులో పీజీ స్టూడెంట్. తనను కొంత మంది ప్రొఫెసర్లు వేధిస్తున్నారంటూ గత ఏప్రిల్ నెలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులకు, గవర్నర్‌కు శిల్ప ఫిర్యాదు కూడా చేసింది.
శిల్ప ఆత్మహత్యపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిన్న సాయంత్రం విడుదలైన పీజీ ఫలితాల్లో శిల్ప ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారనే కోపంతోనే కావాలని ప్రొఫెసర్లు ఫెయిల్ చేశారని, ఆ బాధతోనే శిల్ప ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment