Young Love Failure Person Ends Life In Kalikiri - Sakshi
Sakshi News home page

ప్రేమించిన యువతితో వరుస లేదనడంతో.. ఇంటి నుంచి వెళ్లి..

Aug 9 2021 9:21 AM | Updated on Aug 9 2021 11:54 AM

Love Failure Young Person Life Ends In Kalikiri - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చిత్తూరు: మండలంలోని గుండ్లూరు గ్రామం కొర్నమిట్టపల్లె చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుటుంబసభ్యుల కథనం మేరకు... కొర్నమిట్టపల్లెకు చెందిన సుబ్బరాజ కుమారుడు కే.అశోక్‌ బాబు(23) తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈసీజీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో తన సమీప బంధువుల అమ్మాయిని కొంతకాలంగా ప్రేమించాడు.

ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఆ అమ్మాయితో నీకు వరుసలేదని, వద్దని మందలించారు. దీంతో మూడు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొర్లకుంట గ్రామం టి.మాదిగపల్లె సమీపంలోని అటవీప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఆదివారం గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మృతుడు అశోక్‌బాబుగా గుర్తించారు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు ఆత్మహత్యకు పాల్పడిందని తమ కుమారుడేనని చూసి గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు తండ్రి సుబ్బరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement