Housing Structures
-
అన్నమయ్య జిల్లా కలికిరిలో టీడీపీ నేతల గూండాగిరి
సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. కలికిరిలో టీడీపీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు అవినాష్ రెడ్డి నేతృతంలో దళితుల గృహ నిర్మాణాలపై దాడులకు పాల్పడారు. ఈ ఘటనలో ఇరువురు గాయపడ్డారు. దళితుల వాహనాలను కూడా ధ్వంసం చేసి.. బీరు బాటిల్స్‌తో బీభత్సం సృష్టించారు. సర్వేనెంబర్1098/2 గృహ నిర్మాణాలను పచ్చమూకలు ధ్వంసం చేశాయి. కన్నీరు మున్నీరుగా బాధితులు విలపిస్తున్నారు. టీడీపీ నేత అవినాష్‌రెడ్డి తోపాటు దాడిలో పాల్గొన్న వారిపై పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే టీడీపీ గుండాలను అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
AP: జాప్యం లేకుండా ఇళ్ల పట్టాలు
సాక్షి, అమరావతి: న్యాయ వివాదాల కారణంగా పేదలకు ఇళ్ల పట్టాల మంజూరులో జాప్యం జరగకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. కోర్టు కేసుల పరిష్కారంలో జాప్యమయ్యే చోట పేదలకు ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాలపై వెంటనే ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. గృహ నిర్మాణాలపై సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విశాఖలో 1.43 లక్షల మందికి ఇళ్ల పట్టాలు కోర్టు వివాదాలు తొలగిపోవడంతో ఏప్రిల్ 28వతేదీన విశాఖలో 1.43 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. పట్టాల పంపిణీ పూర్తి కాగానే ఇళ్ల నిర్మాణ పనులు జూన్ నాటికి ప్రారంభమవుతాయని వివరించారు. దాదాపు 63 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. భూమిని చదును చేయడంతో పాటు అప్రోచ్ రోడ్ల నిర్మాణం, లే అవుట్లలో నీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఐదువేలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్న చోట సామగ్రి భద్రపరిచేందుకు వీలుగా గోడౌన్ల నిర్మాణం చేపడుతున్నామని అధికారులు చెప్పారు. 66 గోడౌన్లకుగానూ 47 గోదాముల నిర్మాణం ప్రారంభమైనట్లు తెలిపారు. గృహ నిర్మాణాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాణ్యతలో తేడా వస్తే కఠిన చర్యలు పేదల ఇళ్లకు ఇచ్చే విద్యుత్తు ఉపకరణాలు అత్యంత నాణ్యతతో ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. బల్బులు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు తదితరాలన్నీ నాణ్యమైనవే ఉండాలన్నారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ► ప్రజా ప్రతినిధులకు సత్కారం పేదల ఇళ్ల నిర్మాణంలో చురుగ్గా పాలు పంచుకుంటున్న ప్రజాప్రతినిధులను సత్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. వారు చొరవ చూపిన చోట నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. మండలానికి ఒక సర్పంచ్, మున్సిపాల్టీకి ఒక కౌన్సిలర్, జిల్లాకు ఒక ఎంపీపీ, జడ్పీటీసీకి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇళ్లు పూర్తయ్యే నాటికి కనీస సదుపాయాలు జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే నాటికి తాగునీరు, విద్యుత్తు లాంటి ప్రాథమిక అవసరాలను కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అనంతరం కాలనీలకు సామాజిక, మౌలిక సదుపాయాలను వేగంగా సమకూరుస్తూ ముందుకు సాగాలని నిర్దేశించారు. సమగ్ర ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో కాలనీల్లో పనులు చేపట్టి ముందుకు సాగాలన్నారు. ఆయా విభాగాలన్నీ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. జగనన్న కాలనీల్లో అభివృద్ధి పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు మరింత వేగంగా కొనసాగేలా మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాల్లో ప్రగతి ఆధారంగా వారి పనితీరును మదింపు చేస్తామని స్పష్టంచేశారు. ఇకపై ఈ సమీక్షలో మున్సిపల్ కమిషనర్లు కూడా పాల్గొనాలని సూచించారు. సంపూర్ణ గృహహక్కుపై.. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపైనా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఇప్పటివరకూ పథకాన్ని 10.2 లక్షల మంది వినియోగించుకున్నారని, 6.15 లక్షల మంది రిజిస్ట్రేషన్లు పూర్తైనట్లు అధికారులు వివరించారు. మిగిలినవారికి కూడా వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ మరింత మంది ముందుకు వస్తారన్నారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై మార్గదర్శకాలు టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. టిడ్కో ఇళ్లు అత్యంత పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, దీనికోసం మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు. ఆదర్శంగా ఎంఐజీ లే అవుట్లు మధ్య తరగతికి ఎంఐజీ ప్లాట్ల పథకంపై కూడా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. పట్టణాలు, నగరాలున్న 116 నియోజకవర్గాల్లో ఎంఐజీ ప్లాట్ల పథకానికి తొలుత ప్రాధాన్యత ఇవ్వాలని, మిగిలిన చోట్ల కూడా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 41 నియోజకవర్గాల్లో 4127.5 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వివాదాలు, చిక్కులు లేనివిధంగా క్లియర్ టైటిల్‌తో సరసమైన ధరలకు ఈ ప్లాట్లు అందచేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలకు సంబంధించి లే అవుట్లలో అన్నిరకాల ప్రమాణాలను పాటిస్తూ ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఇతర లే అవుట్లకు మార్గదర్శకంగా ప్రభుత్వ ఎంఐజీ లే అవుట్లు ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. సమావేశంలో ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఇళ్ల నిర్మాణానికి రూ.13,105 కోట్లు ఇళ్ల పట్టాలు కాకుండా కేవలం గృహ నిర్మాణం కోసమే గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.3,600 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.13,105 కోట్లు గృహ నిర్మాణం కోసం వ్యయం చేయనుంది. ఈ ఏడాది 35 లక్షల టన్నుల సిమెంటు, 3.46 లక్షల టన్నుల స్టీల్‌ను ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించనుంది. తొలి దశలో భాగంగా దాదాపు 15.60 లక్షల ఇళ్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. -
సర్వ హక్కులతో స్వగృహాలు
మీకెందుకయ్యా.. కడుపుమంట? ఈ రోజు మీ అన్న ప్రభుత్వం.. మీ తమ్ముడి ప్రభుత్వం మంచి చేస్తుంటే జీర్ణించుకోలేని శక్తులు చాలా ఉన్నాయి. అది చంద్రబాబు కావచ్చు.. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 కావచ్చు. ఒకవేళ వారు మీ దగ్గరికి వస్తే కొన్ని ప్రశ్నలు అడగండి. అయ్యా.. మా ఇళ్లను ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండా మార్కెట్ రేటుకు కొనుగోలు చేస్తారా? అని గట్టిగా నిలదీయండి. మీ వారసులకేమో మీ ఆస్తులను రిజిస్టర్ చేసి ఇస్తారు కదా..! మరి మా బిడ్డలకు ఇంటిని చట్టబద్ధంగా రిజిస్టర్ చేసే అవకాశాన్ని మా జగనన్న మాకు కల్పిస్తుంటే మీకెందుకయ్యా కడుపు మంట? అని గట్టిగా అడగండి. మీరు కొనుగోలు చేసిన రిజిస్టర్డ్ భూముల మాదిరిగానే మా ఇంటి విలువ కూడా పెరిగేలా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని మా అన్న చెబుతుంటే మీకెందుకయ్యా కడుపు మంట? అని ప్రశ్నించండి. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఇల్లు అంటే కేవలం ఇటుకలు, సిమెంట్‌తో నిర్మించిన కట్టడం మాత్రమే కాదని ఒక మనిషి సుదీర్ఘకాలం పడిన కష్టానికి, సంతోషానికి సజీవ సాక్ష్యం లాంటిదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.26 వేల కోట్ల విలువైన భూమిని 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల కింద ప్రభుత్వం పంపిణీ చేసిందని చెప్పారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా పేదలకు స్థిరాస్తిపై వివాదరహితంగా, క్లియర్ టైటిల్‌తో సర్వహక్కులూ కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ.. కలను నిజం చేస్తున్నాం... ఇవాళ నా పుట్టిన రోజు నాడు దేవుడి దయతో దాదాపు 52 లక్షల మందికిపైగా మంచి జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సొంతూరు మాదిరిగానే మనం ఉన్న ఇల్లును కూడా జీవిత కాలం గుర్తు పెట్టుకుంటాం. రూపాయి రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న ఇంటిని తదనంతరం పిల్లలకు ఒక ఆస్తిగా ఇవ్వాలని ఆరాట పడే పేదల కలలను నిజం చేస్తున్నాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పేదలకు ఇంటి పట్టాలు, స్థలాలు మాత్రమే ఇస్తున్నారు కానీ వాటిపై హక్కులు కల్పించడం లేదు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా 52 లక్షలకుపైగా కుటుంబాలకు రూ.1.58 లక్షల కోట్ల విలువైన ఆస్తిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నాం. ఇందులో ఓటీఎస్‌తో మొదటగా లబ్ధి పొందుతున్న 8.26 లక్షల మందికి పత్రాల పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాం. ఓటీఎస్ లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హక్కులు లేక.. దిక్కు తోచక తమ ఇంటిలో కేవలం నివసించే హక్కు మాత్రమే ఉన్న 52 లక్షల మందికి సర్వ హక్కులు కల్పించేందుకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని తెచ్చామని సగర్వంగా తెలియజేస్తున్నా. వారికి అందించే ఆస్తి విలువ రూ.1.58 లక్షల కోట్లు. అది నేరుగా వారి చేతుల్లోకి వస్తుంది. నచ్చినట్లుగా ఉపయోగించుకోవచ్చు. ఇంటిపై హక్కులు దక్కితే అవసరం వచ్చినప్పుడు మార్కెట్ రేటుకు అమ్ముకునే వీలుంటుంది. ఇప్పటిదాకా ఆ అవకాశం లేదు. వారసత్వంగా సంతానానికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే వీలు కూడా లేదు. కష్ట కాలంలో తనఖా పెట్టి బ్యాంకు రుణాలు తీసుకునేందుకూ వీల్లేదు. ఏ హక్కూ లేకుండా గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లలో గడపాల్సిన పరిస్థితి. శనక్కాయలు, బెల్లానికీ సరిపోవు... ఇంటి మీద మనకు హక్కు లేకపోతే మార్కెట్లో రూ.10 లక్షలు పలికే నివాసం విలువ మరో రకంగా ఉంటుంది. రూ.2 లక్షలకు కూడా కొనేవారుండరు. శనక్కాయలకు, బెల్లానికి కూడా సరిపోవు. ఉదాహరణకు ఈ రోజు ఇదే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేసిన భూమి, ఇంటికి.. రిజిస్ట్రేషన్ చేయని వాటికి తేడా ఎంత ఉందో ఒకసారి గమనించాలని కోరుతున్నాం. రిజిస్ట్రేషన్ జరిగిన వాటి విలువ చేయని వాటితో పోలిస్తే పలు రెట్లు అధికంగా ఉంది. నా పాదయాత్ర సమయంలో నన్ను కలిసిన అక్క చెల్లెమ్మలను అడిగి ఈ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించాం. పేదలకు ఇంటిపై సర్వ హక్కులు కల్పిస్తూ అవసరమైతే కష్ట కాలంలో అమ్ముకునే స్వేచ్ఛను కూడా ఈరోజు నుంచి కల్పిస్తున్నాం. ఓటీఎస్ (వన్‌టైమ్ సెటిల్మెంట్) ద్వారా తొలుత లబ్ధి పొందిన 8.26 లక్షల మందికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి సంపూర్ణ హక్కులతో డాక్యుమెంట్లను ఇవాళ అందచేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సొంత డబ్బులతో ఇల్లు నిర్మించుకున్న దాదాపు 12 లక్షల కుటుంబాలు కేవలం రూ.10 చెల్లిస్తే చాలు రిజిస్ట్రేషన్ చేసి హక్కులు కల్పిస్తున్నాం. హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకున్న వారు గ్రామాల్లో రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లో రూ.20 వేలు చెల్లిస్తే చాలు. వీరందరికీ సర్వ హక్కులతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఆస్తిని వారి చేతుల్లో పెడతాం. పేదలకు రూ.16 వేల కోట్ల లబ్ధి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ వద్ద స్థలాలను తనఖా పెట్టి ఇళ్ల నిర్మాణాల కోసం రుణాలు తీసుకున్న 40 లక్షల మంది లబ్ధిదారులు అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.14,400 కోట్లు బకాయి ఉండగా ఏకంగా రూ.10 వేల కోట్లు పూర్తిగా మాఫీ చేస్తున్నాం. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీల రూపంలో మరో రూ.6 వేల కోట్లను ప్రభుత్వమే భరిస్తూ పేదలకు ప్రయోజనం కల్పిస్తోంది. మొత్తంగా రూ.16 వేల కోట్ల మేర లబ్ధి చేకూరుస్తున్నాం. ఒకవేళ అదే వారే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తే 7.50 శాతం మేర రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలు కట్టాలి. ఒక ఇంటి విలువ రూ.15 లక్షలు అని లెక్కేసుకున్నా కనీసం రూ.లక్ష రిజిస్ట్రేషన్ ఫీజు కింద కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు అది కూడా పూర్తిగా మాఫీ చేస్తూ ఉచితంగా రిజిస్ట్రేషన్‌తో 52 లక్షల కుటుంబాలకు మేలు చేస్తున్నాం. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగింపు గత ప్రభుత్వ హయాంలో దాదాపు 41 వేల మంది అసలు, వడ్డీ కడితే కేవలం డి.ఫారం మాత్రమే దక్కింది. అటువంటి వారందరికీ ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు ఇస్తున్నాం. నిషేధిత భూముల జాబితా (22 ఏ) నుంచి పూర్తిగా తొలగిస్తున్నాం. సబ్ రిజిస్ట్రార్æ కార్యాలయాలకు వెళ్లి గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా మీ ఇంటిని సచివాలయాల్లోనే నామమాత్రపు రుసుము చెల్లించి కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓటీఎస్ ద్వారా లబ్ధి పొందిన వారికి ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు. పేదలు రూ.15.29 కోట్లు చెల్లిస్తే హక్కులేవి? ప్రభుత్వం కట్టించిన పేదల ఇళ్లపై కనీసం వడ్డీనైనా మాఫీ చేయాలని 2014 నుంచి 2019 వరకు ఈ పెద్దమనిషి చంద్రబాబు పాలనలో అధికారులు ఐదుసార్లు ప్రతిపాదనలు పంపితే నిరాకరించారు. రుణమాఫీ దేవుడెరుగు.. కనీసం వడ్డీ కూడా మాఫీ కూడా చేయని ఈ పెద్ద మనిషి ఇవాళ మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. దాదాపు 43 వేల మంది లబ్ధిదారులు అప్పో సప్పో చేసి రూ.15.29 కోట్లు చెల్లిస్తే గత సర్కారు ఎలాంటి యాజమాన్య హక్కులు కల్పించిందని గట్టిగా నిలదీయండి. ఆ పెద్ద మనుషులకు చెప్పండి అధికారంలోకి వచ్చిన 30 నెలల వ్యవధిలోనే ఈ ప్రభుత్వం ఎలాంటి వివక్ష, దళారులకు తావు లేకుండా బటన్ నొక్కి నేరుగా రూ.1.16 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా అర్హుల ఖాతాలకు జమ చేసింది. ఒక్క రూపాయి కూడా లంచానికి ఆస్కారం లేకుండా పంపిణీ చేసి మంచి చేసిన జగనన్న మీవద్ద నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటాడా? ఈ విషయాన్ని ఆ పెద్ద మనుషులకు ఒకసారి తెలియజేయాలని కోరుతున్నా. మీ పిల్లలైతే ఇంగ్లీష్ మీడియం బడుల్లో చదవచ్చు.. మా పిల్లలేమో తెలుగుమీడియం బడుల్లో మాత్రమే చదవాలా? అని వారిని అడగండి. మా జగనన్న 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి పేదలకు మంచి చేస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకోవడం ధర్మమేనా? అని ప్రశ్నించండి. ఇదే రాజధాని (అమరావతి)లో పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే సామాజిక అసమతుల్యత నెలకొంటుందని ఆ పెద్ద మనుషులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఓటీఎస్ ఉగాది వరకు పొడిగింపు ఓటీఎస్ పథకాన్ని వచ్చే ఉగాది వరకు పొడిగిస్తున్నాం. వీలైనంత ఎక్కువ మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 2వతేదీ వరకు పొడిగించాలని నిర్ణయించాం. ఈ పథకం ద్వారా మంచి జరుగుతుంది. సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఒక చరిత్ర... చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా రెండున్నరేళ్లలో 31 లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీ చేశాం. ఒక అన్నగా నిండు మనసుతో అక్కచెల్లెమ్మలకు అందచేశాం. ఆ ఇంటి స్థలాల విలువ అక్షరాలా రూ.26 వేల కోట్లు. అందులో ఇప్పటికే 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు కూడా మొదలయ్యాయి. గృహ నిర్మాణాలు పూర్తయ్యాక మౌలిక వసతులతో కలిపి ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన ఆస్థిని పెట్టినట్లు అవుతుంది. హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని, పేర్ని నాని, చెరుకువాడ శ్రీరంగనాధ రాజు, ధర్మాన కృష్ణదాస్ తానేటి వనిత, పి.విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల్, శాసనమండలి చైర్మన్ కె.మోషేన్‌రాజు, సీఎం ప్రొగామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘరామ్, ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు సభకు అధ్యక్షత వహించారు. -
పక్కాగా..
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టిన అన్నాడిఎంకే సర్కారు గుడిసెల నిర్మూలన విభాగం నేతృత్వంలో పేదలకు పక్కా గృహాల నిర్మాణాలపై దృష్టి కేంద్రీకరించింది. గత ఐదు సంవత్సరాల్లో 50 వేల 470 బహుళ అంతస్తుల తరహా, వ్యక్తిగత గృహాలు(సొంత స్థలంలో సొంతంగా) లబ్దిదారులకు నిర్మించి ఇచ్చారు. మరో మూడు వేల 29 బహుళ అంతస్తులు, 7513 వ్యక్తిగత గృహాల నిర్మాణాలు సాగుతున్నాయి. మళ్లీ అధికార పగ్గాలు తమ చేతికి చిక్కిడంతో పక్కాగా...పక్కా గృహాల నిర్మాణాల మీద మళ్లీ అమ్మ జయలలిత దృష్టి కేంద్రీకరించే పనిలో పడ్డారు. ఈ ఏడాది 23,476 గృహాల్ని నిర్మించేందుకు సిద్ధం అయ్యారు.ఇందుకు తగ్గ ఆమోద ముద్రను బుధవారం వేశారు. చెన్నై, తంజావూరు, తిరుచ్చి, ఈరోడ్, కోయంబత్తూరు, పుదుకోట్టై, నామక్కల్, నాగపట్నం నగరాల్లో బహుళ అంతస్తుల తరహాలో 7204 గృహాల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. గుడిసెల్లో ఉన్న వాళ్లు సొంతంగా స్థలం కల్గి పక్కా గృహాలను నిర్మించుకోదలచని పక్షంలో అందుకు రూ. 2.1 లక్షలు అందించేందుకు నిర్ణయించారు. నాలుగు వందల చ. అడుగుల్లో హాల్, బెడ్ రూమ్, వంట గది, స్నానపు గది, మరుగు దొడ్డి సౌకర్యంతో ఈ ఇంటిని నిర్మించుకోవచ్చు. లబ్దిదారులు అదనంగా 300 చ. అడుగుల మేరకునిర్మించుకునేందుకు అవకాశం కల్పించినా, అందుకు తగ్గ భారాన్ని వారే మోయాల్సి ఉంటుంది. -
పెట్టుబడికి స్థలమే భేష్!
- ధర విషయంలో జాగ్రత్త అవసరం - లే అవుట్ కాకుంటే... రక్షణ చర్యలూ ఉండాలి సాక్షి, హైదరాబాద్: ఉండటానికైతే ఇల్లో లేకుంటే ఫ్లాటో కొనటం మంచిదే. కానీ పెట్టుబడులు పెట్టాలనుకుంటే...? అందుకు రియల్ ఎస్టేట్‌ను ఎంచుకుంటే...? ఈ ప్రశ్నలు వచ్చినపుడు పెట్టుబడులకైతే స్థలమే చక్కని మార్గమనేది నిపుణుల సూచన. దీర్ఘకాలం వేచి చూడగలిగితే దీనిపై అధిక రాబడిని అందుకోవచ్చన్నది వారి మాట. ఈ విషయం ఇప్పటికే అనేకసార్లు రుజువైందని కూడా వారు చెబుతున్నారు. నిజానికి దీర్ఘకాలిక పన్ను లాభాలకోసం నివాస సముదాయాల్లో పెట్టుబడి పెట్టడం అందరికీ తెలిసిందే. కాకపోతే దీనితో పోల్చినపుడు స్థలాలపై పెట్టుబడే ఎక్కువ రాబడినిస్తుందనేది ఇప్పటిదాకా పలుమార్లు నిరూపితమైందని వారు పేర్కొన్నారు. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిపుడు దేశంలో అందుబాటు ఇళ్ల నిర్మాణాలపై దృష్టిసారించాయి. ప్రత్యేక పథకాలతో ముందుకొస్తున్నాయి కూడా. కాబట్టి స్థలాలకు గిరాకీ పెరుగుతుందే తప్ప తగ్గదని, ఎవరిదగ్గరైనా డబ్బులుండి, పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన ఉంటే స్థలానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని వారు చెబుతున్నారు. స్థలమెక్కడ? నిపుణుల సూచనల ప్రకారం... ముందుగా మీరు స్థలంపై ఎంత పెట్టుబడి పెట్టగలరనే విషయంపై ఓ అవగాహనకు వచ్చాక, ఆ తర్వాత ఎక్కడ కొనాలో నిర్ణయించుకోవాలి. ఇప్పుడు కాకపోయినా ఓ పదేళ్లయ్యాకైనా స్థలం విలువ రెండుమూడు రెట్లు పెరిగే అవకాశం గల ప్రాంతాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఉద్యోగావకాశాలను కల్పించడానికి ఆస్కారమున్న ప్రాంతాలైతే ఉత్తమం. హెచ్ఎండీఏ లాంటి స్థానిక సంస్థలు తరచూ వేలం పాటలను నిర్వహిస్తాయి కాబట్టి... వీలుంటే ఓ సారి కనుక్కోండి. క్రమం తప్పకుండా లావాదేవీలు నిర్వహించే మీ బ్యాంకు ఆమోదం ఉన్న లే అవుట్లు ఉన్నాయేమో ఓసారి ఆరా తీయండి. బృహత్ ప్రణాళిక ప్రకారం మీరు కొనే ప్రాంతం రెసిడెన్షియల్ జోన్ పరిధిలో ఉంటే ఉత్తమం. దేని పరిధిలోకి వస్తుంది? మీరు కొనాలనుకున్న స్థలం దేని పరిధిలోకి వస్తుంది? అంటే రెసిడెన్షియల్ జోన్ కిందికొస్తుందా? కన్జర్వేషన్ జోన్ పరిధిలోకి వస్తుందా? అనే విషయాల్ని కనుక్కోండి. హెచ్ఎండీఏ తాజా బృహత్ ప్రణాళిక ప్రకారం.. దాదాపు ఆరు వేల చదరపు కిలో మీటర్లు విస్తరించిన హుడా ఎక్స్టెండెడ్ ఏరియాను 12 స్థల వినియోగ జోన్లుగా వర్గీకరించారు. ఏ స్థలం ఏయే జోన్ పరిధిలోకి వస్తుందో తెలియజేస్తూ మ్యాప్‌లు కూడా విడుదల చేశారు. అయితే ఈ విషయంపై ఒకోసారి హెచ్ఎండీఏ అధికారుల్ని అడిగినా సరైన సమాధానం రాకపోవచ్చు. రిక్రియేషన్ జోన్ పరిధిలోని స్థలం కొని విశాలమైన ఇల్లు కట్టుకుంటానంటే కుదరదు. కాబట్టి, ఈ విషయంలో ముందే అవగాహనకు రండి. ధర ఎంత? మాంద్యం తర్వాత మార్కెట్లో 30 శాతం స్థలాల ధరలు తగ్గుముఖం పట్టాయి. మరి మీరు ఎంపిక చేసుకున్న ప్లాటులో ప్రస్తుతం ధరెంత చెబుతున్నారు? బూమ్ సమయంలో ధర ఎంతుందో బేరీజు వేయండి. ఆ తర్వాత సదరు సంస్థ నుంచి స్థలం పత్రాలు, టైటిల్ డీడ్, పన్ను రశీదులుంటే అడిగి తీసుకోండి. వాటిని లాయర్‌తో పరిశీలింపజేయండి. స్థానిక సంస్థల నుంచి స్థలం కొనాలని భావిస్తే బేరమాడే అవకాశముండదు. అదే ప్రైవేటు సంస్థలనుకోండి.. మీరు ఎంత దాకా పెట్టగలరో సూటిగా చెప్పొచ్చు. ధర విషయంలో మీరో నిర్ణయానికి రాగానే.. సంస్థ నిబంధనల ప్రకారం కొంత సొమ్ము ముందు చెల్లించండి. మిగతా మొత్తాన్ని ఎలా చెల్లిస్తారో వివరించండి. కొన్ని ప్రైవేటు రియల్టీ సంస్థలూ బ్యాంకులతో అవగాహన కుదుర్చుకుని రుణాలిస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దు. రిజిస్ట్రేషన్ మీ పేరిటే ఉండాలి.. మీరు సొమ్మంతా కట్టేశాక.. స్థలాన్ని మీ పేరిట రిజిస్టర్ చేసుకోండి. ఏదేనీ ఓ లే-అవుట్లో స్థలం కొంటే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఖాళీగా ఉన్న ప్రాంతంలో కొంటే ముందుగా పునాది వేసుకోండి. వీలైతే గోడ కూడా కట్టుకోండి. అపరిచితులు ఆక్రమించకుండా ఉండాలంటే మాత్రం మీరు క్రమం తప్పకుండా మీ స్థలంపై దృష్టి సారించాలి. -
ఇందిరా ఆవాస్ యోజనలో భారీ అక్రమాలు
నకిలీ పేర్లు సృష్టించి కోట్లాది రూపాయలు స్వాహా చేసిన అధికారులు బీడీ హళ్లి పంచాయతీ పరిధిలో 594 ఇళ్ల బిల్లులు స్వాహా బీడీహళ్లి గ్రామ పంచాయతీ సభ్యుల ఆరోపణ బళ్లారి: ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలతో పాటు నిరుపేదలందరికీ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలనే సదుద్ధేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు చేపట్టి ఇళ్లు నిర్మాణాలు చేపడుతుంటే కొందరు అధికారులు ఇళ్ల నిర్మాణాల్లో కాసుల పంట పండించుకున్న వైనం వెలుగు చూసింది. 2009-10వ సంవత్సరంలో ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇళ్ల నిర్మాణాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా బయటపడ్డాయి. బళ్లారి తాలూకా బీడీ హళ్లి గ్రామ పంచాయతీ పరిధిలో 594 ఇళ్లకు సంబంధించిన బిల్లులను సంబంధిత గ్రామ పంచాయతీ అధికారి పరశురాంతో పాటు మరికొందరి భాగస్వామ్యంతో కోట్లాది రూపాయలు స్వాహా చేసినట్లు బీడీ హళ్లి గ్రామానికి చెందిన బళ్లారి ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు భాస్కరరెడ్డితో పాటు పలువురు పేర్కొన్నారు. బుధవారం బీడీహళ్లి గ్రామ పంచాయతీలో ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సంజీవరెడ్డి, ప్రభాకరరెడ్డి, దుర్వాస్, చిదానందప్ప, నరేంద్రబాబులు కలిసి నగరంలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. బీడీ హళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అశోక్‌నగర్ క్యాంపు, శివపుర, చాగనూరు, బీడీహళ్లి గ్రామాలలో ఇళ్లు నిర్మించకుండా 594 ఇళ్ల బిల్లులను సంబంధిత అధికారులే స్వాహా చేసినట్లు రికార్డులతో వివరించారు. ఈసందర్భంగా ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు భాస్కరరెడ్డి మాట్లాడుతూ 2009-10వ సంవత్సరంలో బీడీహళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పేదలకు, ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన ఇళ్లను సంబంధిత అధికారి నకిలీ దాఖలాలు సృష్టించి కోట్లాది రూపాయలు స్వాహా చేసినట్లు రికార్డులతో సహా బయటపెట్టారు. ఉదాహరణకు బీడీహళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అశోక్ నగర్ క్యాంపు 30 సంవత్సరాల క్రితం ఏర్పడిందని, అప్పుడే 115 ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు. ప్రస్తుతం ఉన్నది కూడా 120 లోపు ఇళ్లు మాత్రమేనన్నారు. అయితే అదే అశోక్ నగర్ క్యాంపులో 242 ఇళ్లు నిర్మించినట్లు రికార్డులలో ఉందన్నారు. అధికారిక లెక్కల ప్రకారం 120 ఇళ్ల లోపు ఉంటే, 242 ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు నకిలీ దాఖలాలు సృష్టించారని ఆరోపించారు. అదే విధంగా బీడీ హళ్లిలో 59, శివపురలో 117, చాగనూరులో 176 ఇళ్లు నిర్మించినట్లు నకిలీ పేర్లు సృష్టించి బిల్లులు స్వాహా చేశారన్నారు. ఒక్క అశోక్‌నగర్ క్యాంపులోనే 242 ఇళ్లకు గాను దాదాపు ఒక కోటి రూపాయలు స్వాహా చేశారన్నారు. మొత్తం పంచాయతీ పరిధిలో ఇదే తరహాలో కోట్లాది రూపాయలను సంబంధిత అధికారి స్వాహా చేశారన్నారు. ఈ విషయంపై తాము తాలూకా పంచాయతీ అధికారి, జెడ్పీ సీఈఓ, జిల్లాధికారికి ఫిర్యాదు చేశామన్నారు.అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో తాము గురువారం బెంగళూరులోని లోకాయుక్త అధికారులకు బీడీహళ్లిలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు చేస్తామన్నారు. తాము ఫిర్యాదు చేసినా తనిఖీ కూడా చేయనందున సంబంధిత అధికారులందరిపై కూడా లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తామన్నారు. కోట్లాది రూపాయలు స్వాహా చేసిన పంచాయతీ సెక్రటరీ పరశురాం నుంచి నిధులు రాబట్టాలని, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని, క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే 2009 నుంచి 2014 వరకు గ్రామ పంచాయతీ పరిధిలోని ఉపాధి హామీ పథకంలో కూడా భారీగా అక్రమాలు జరిగాయని, వీటిపై కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. -
గృహాలకు వీడిన గ్రహణం
ఖమ్మం వైరా రోడ్: ఇందిరమ్మ లబ్ధిదారులకు శుభవార్త. ఇళ్ల నిర్మాణాల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు జిల్లా ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు నియోజకవర్గ డీఈలు, ఏఈలకు హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రగతిలో ఉన్న ఇళ్ల వివరాలు, ఇంటి కొలతలు, ప్లాట్ కొలతలు తీసుకుని ఫొటోలు తీసి ఆన్లైన్లో పొందుపర్చాలని పేర్కొన్నారు. అయితే.. ఇప్పటికే 5 వేల ఇళ్ల వివరాలను అధికారులు ఆన్లైన్లో పొందుపర్చారు. పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిన ఇళ్ల వివరాలను 50 శాతం వరకు గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డెరైక్టర్‌కు పంపేందుకు సిద్ధం చేశారు. పదిరోజుల్లో 70 శాతానికి పైగా వివరాలను పంపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో పెండింగ్ బిల్లులు రూ. 35 కోట్లు మార్చి 25 నుంచి ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు ఆగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న 15 వేల ఇళ్లకు రూ.35 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సీబీసీఐడీ విచారణ అనంతరం... జిల్లాలో మూడు విడతల్లో 4లక్షల 10వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యయి. వాటిలో ఇప్పటి వరకు 2.8 లక్షలు పూర్తయ్యాయి. మరో 64వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మంజూరైన ఇళ్లలో చాలా వరకు నిధులు దుర్వినియోగమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై సీబీసీఐడీ బృందం నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రగతిలో ఉన్న గృహాలకు బిల్లులు నిలిచిపోయాయి. సీబీసీఐడీ విచారణ పూర్తిచేసిన అనంతరం నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో గృహ నిర్మాణ శాఖ అధికారులకు పెండింగ్ బిల్లు విడుదల చేసేందుకు అవకాశం లభించింది. బిల్లులు చెల్లించాల్సిన లబ్ధిదారుల వివరాలు పంపించాలని పీడీకి ఆ శాఖ మేనేజింగ్ డెరైక్టర్ నుంచి నాలుగు రోజుల క్రితం ఆదేశాలు అందాయి. -
కట్టాలా.. వద్దా!
పేదోడి గూడు అయోమయంలో పడింది. అధికారంలోకి వస్తే రూ.మూడు లక్షలతో బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తామని చెప్పిన టీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఇళ్ల నిర్మాణంపై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే జిల్లాలో పేదలకు మంజూరైన ‘ఇందిరమ్మ’ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని పూర్తి చేయాలా? వద్దా? అన్న మీమాంస లబ్ధిదారుల్లో ఉంది. ఒక వేళ పూర్తి చేస్తే వాటికి బిల్లులు వస్తాయో రావో తెలియదు. అలాగే వదిలేస్తే.. కొత్త పథకంలో పాత లబ్ధిదారులకు చోటు దక్కుతుందో లేదో తెలియదు.. అప్పుచేసి చాలామంది ఇళ్లు ప్రారంభించారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి కూడా బిల్లులు అందాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఈ అంశాలపై ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో ఇళ్ల పనులు ప్రారంభించిన వాళ్లకు ఎటూ పాలుపోవడం లేదు. - చేవెళ్ల, మొయినాబాద్ అయోమయంలో ఇందిరమ్మ లబ్ధిదారులు జిల్లాలో మంజూరైన మొత్తం ఇళ్లు: 2,09,194 ఇప్పటికీ ప్రారంభించనివి: 46,058 వివిధ దశల్లో ఉన్నవి: 43,914 * ఎనిమిది నెలలుగా అందని బిల్లులు * నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలు * కొత్తవి మంజూరుకావు.. కట్టినవాటికి బిల్లులివ్వరు * అసలే మొదలుకాని ఇళ్ల పరిస్థితేంటి.. చేవెళ్ల/ మొయినాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. ఎనిమిది నెలలుగా బిల్లులు అందకపోవడంతో ప్రారంభించిన నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులు వాటిని నిర్మించాలా? వద్దా? అనే మీమాంసలో ఉండిపోయారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు దాటిపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మంజూరు, నిర్మాణంలో ఉన్న పాతవాటి విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే రూ.3 లక్షల వ్యయంతో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తానని పార్టీ అధ్యక్షుని హోదాలో కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడడంతో చాలా మంది డబుల్ బెడ్రూం ఇళ్లపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పరిస్థితి జిల్లా అంతటా ఉండడంతో లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మార్చి నెల నుంచి బిల్లుల నిలిపివేతతో లబ్ధిదారుల ఇబ్బందులు గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కోడ్‌లో భాగంగా ఎన్నికల కమీషన్ మార్చి నుంచి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లించడాన్ని నిలిపేసింది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఐదునెలలు దాటినా బిల్లుల చెల్లింపు విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అప్పటి నుంచి చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి, నవాబ్‌పేట మండలాల్లో 2065 మంది లబ్ధిదారులకు పలు దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్ల బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. దాంతో అప్పోసప్పో చేసి నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిల్లుల చెల్లింపులు లేక మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తిచేయలేక అసంపూర్తిగానే మిగిలాయి. కొన్ని ఇళ్లకు ఒక బిల్లు, ఇంకొన్ని ఇళ్లకు రెండు బిల్లులు, మరి కొన్ని ఇళ్లకు మూడు బిల్లులు వచ్చి ఆగిపోయాయి. ఇంకొంత మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకున్నా ఒక్క బిల్లుకూడా రాలేదు. అర్ధాంతరంగా ఆగిన నిర్మాణాలు గత ఎనిమిది నెలలుగా ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం బిల్లుల చెల్లింపు నిలిపివేసింది. ఎన్నికలు పూరై ్తనా ఇంకా బిల్లులు మాత్రం చెల్లించడంలేదు. ఇటు బిల్లులు రాక అటు ప్రైవేటుగా అప్పులు చేయలేక లబ్ధిదారులు ఇళ్లు నిర్మాణాలను వివిధ దశల్లో నిలిపేశారు. వాటిని పూర్తి చేస్తే ఇందిరమ్మ పథకం ప్రకారమే బిల్లులు చెల్లిస్తారా...? కొత్తగా ప్రవేశపెట్టబోయే పథకం ప్రకారం డబ్బులు చెల్లిస్తారా అనే విషయంలో ప్రభుత్వంనుంచి ఇంకా ఎలాంటి స్పష్టతలేకపోవడంతో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. నిర్మాణాలు మొదలుకాని వాటి పరిస్థితేంటి..? ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన నియోజకవర్గం పరిధిలో సుమారు 3వేలకు పైగా లబ్ధిదారులు ఇప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఆ ఇళ్లకు ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూం పథకాన్ని అమలు చేస్తుందో, లేదోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అప్పట్లో మంజూరైన ఇళ్లను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తుందా అనే అనుమానం సైతం కలుగుతోంది. కొత్త ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఉత్కంఠగా ఎదిరి చూస్తున్నారు. మరి కొత్త ప్రభుత్వం పేదల సొంతింటి కలను ఎలా నిజంచేస్తుందో వేచిచూడాలి. అప్పుచేసి కట్టాం సంవత్సరం కింద ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యింది. అప్పు చేసి రూప్‌లెవల్ వరకు గోడలు కట్టాం. బేస్మిట్ బిల్లు ఒక్కటే వచ్చింది. ఇంకా రెండు బిల్లులు రావాలి. ఆ బిల్లులు వస్తే స్లాబ్ వేద్దామని చూస్తున్నాం. ఎనిమిది నెలలుగా బిల్లులు వస్తలేవు. అప్పుచేసి కొంతవరకు కట్టుకోగలిగాం. ఇళ్లులేక అద్దె ఇంట్లో ఉంటున్నాం. - జాహెదాబేగం, మొయినాబాద్ ఇళ్లు పూరై్తనా ఒక్క బిల్లు కూడా రాలేదు సంవత్సరం కింద ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. వెంటనే పనులు మొదలు పెట్టాం. మూడు నెలల క్రితమే ఇంటి నిర్మాణం పూర్తియింది. ఇప్పటి వరకు ఒక్కసారికూడా బిల్లు రాలేదు. హౌసింగ్ అధికారులను ఎప్పుడడిగినా ఆన్లైన్లో ఉంది. త్వరలోనే వస్తాయని చెబుతున్నారు. కాని బిల్లు ఎప్పుడు వస్తుందో తెలియడంలేదు. - కమ్మరి పద్మమ్మ, సురంగల్ రెండువారాల్లో బిల్లులు వస్తాయి ఎన్నికల ముందు నుంచి ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులను ప్రభుత్వం నిలిపేసింది. అప్పుటి నుంచి ఎవరికీ బిల్లులు రాలేదు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలను మరోసారి పరిశీలిస్తున్నాము. నిర్మాణాలను బట్టి బిల్లులు వస్తాయి. రెండు వారాల్లో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు వచ్చే అవకాశం ఉంది. - ప్రేంసాగర్, గృహనిర్మాణ శాఖ డీఈఈ, చేవెళ్ల -
ఇంటి నిర్మాణం భారం
ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రి ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం కూడా చేతులెత్తేయడంతో సిమెంట్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పెంచిన ధరలకు నిరసనగా సిమెంట్ డీలర్లు మూడురోజులు దుకాణాలు మూసివేసి ఆందోళనలు చేసినా పట్టించుకున్నవారు లేరు. ఐదు రోజుల్లో 50 శాతం పెంపు.. సిమెంట్ ధరలు ఐదు రోజుల్లోనే 50 శాతం పెంచారు. 50కిలోల సిమెంట్ బస్తా రూ.295 (43గ్రేడ్), రూ.310 (53 గ్రేడ్)కు చేరింది. నెల క్రితం ధరలు తక్కువగా ఉండడంతో ఆర్థికంగా ఉన్నవారితోపాటు సామాన్యులూ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. ఈ నెల ఒకటో తేదీన బస్తా సిమెంట్‌కు రూ.200 ఉన్న ధర.. 2, 5 తేదీ వరకు ఏకంగా రూ.310కి చేరింది. జిల్లాలో సుమారు 25 కంపెనీల సిమెంట్ అమ్ముడవుతోంది. ప్రతీ కంపెనీ రూ.5 తేడాతో విక్రయిస్తోంది. ఈ లెక్కన సిమెంట్ కంపెనీలు ఎంత సిండికేట్ సాగిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్దమొత్తం ఒకేసారి పెరగడంతో నిర్మాణరంగం సంక్షోభంలో పడింది. ధరలు మరింత పెరిగే అవకాశముందని డీలర్లు చెబుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికే కూలిరేట్లు భారీగా పెరిగాయి. తాజాగా సిమెంట్ బస్తాపై రూ.100 అదనపు భారం పడుతుండడం నిర్మాణ రంగాన్ని కుంగదీస్తోంది. మరో రెండు రోజుల్లో మరో రూ.30 పెరగనున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. నెలకు రూ.30 కోట్ల భారం జిల్లావ్యాప్తంగా 500 వరకు సిమెంట్ దుకాణాలుంటే.. ఒక్క జిల్లా కేంద్రంలోనే 70 దుకాణాలు (డీలర్) ఉన్నాయి. వీటి ద్వారా ప్రతీనె ల 60వేల టన్నుల సిమెంట్ విక్రయం జరుగుతోంది. జిల్లా కేంద్రంలో 20 వేల టన్నుల సిమెంట్ అమ్ముతున్నట్లు డీలర్లు చెబుతున్నారు. ఈ లెక్కన నెలకు రూ.30 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. పెరిగిన ధరలతో సిమెంట్ కొనుగోలుపైనే రూ.15 కోట్ల అదనపు భారం వినియోగదారులపై పడుతోంది. మిగిలిన ఇసుక, ఇనుము, ఇటుక కలుపుకుంటే నెలకు రూ.30 కోట్ల భారం ప్రజలపై పడుతున్నట్లు నిర్మాణదారులు చెబుతున్నారు. ఇటుకకూ తప్పని పెరుగుదల అకాల వర్షాలతో ఇటుక బట్టీల వ్యాపారం అతలాకుతలమైంది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు. రెండు నెలల క్రితం ట్రాక్టర్ లోడ్ ఇటుక రూ. ఏడు వేలు కాగా.. ప్రస్తుతం రూ. ఎనిమిది వేల నుంచి రూ.పది వేలకు అమ్ముతున్నారు. క్రమంగా పెరుగుతున్న స్టీల్ నిర్మాణంలో స్టీల్ వాడకం తప్పనిసరి. వీటి ధరలు కూడా ఒక్కసారిగా కాకుండా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గత ఏడాది రూ.42 వేలకు టన్ను ఉన్న స్టీల్.. ప్రస్తుతం రూ.55 వేలకు చేరింది. ఏడాదిలోనే ఆరుసార్లు పెరిగి అటు డీలర్లను, ఇటు వినియోగదారులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. నిర్మాణదారుల నుంచి అడ్వాన్సుగా డబ్బులు తీసుకునే పరిస్థితి లేదని, తెల్లవారితే రేటు ఎలా ఉంటుందో కూడా తెలియడం లేదని డీలర్లు చెబుతున్నారు. ఇసుకకు రెక్కలు.. ఇసుక క్వారీలకు ప్రభుత్వం అనుమతి రద్దు చేయడంతో అది మాఫీయాగా మారింది. అక్రమంగా ఇసుక తరలిస్తూ రేట్లను పెంచి అమ్ముతున్నారు. ట్రాక్టర్ ఇసుక రెండు నెలల క్రితం రూ. వెయ్యి నుంచి రూ.1200 ఉండగా, ఇప్పుడది రూ.1700 నుంచి రూ.రెండు వేలకు చేరింది. వర్షాకాలం నాటికి రూ.మూడు వేలకు చేరుతుందేమోనని నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.