బైక్‌లోకి దూరిన పాము.. బండి స్టార్ట్‌ చేయగానే బుసలు కొట్టుకుంటూ.. | Snake Spotted On Bike At Kadapa district | Sakshi
Sakshi News home page

బైక్‌లోకి దూరిన పాము.. బండి స్టార్ట్‌ చేయగానే బుసలు కొట్టుకుంటూ..

Published Tue, Oct 11 2022 9:18 PM | Last Updated on Tue, Oct 11 2022 9:22 PM

Snake Spotted On Bike At Kadapa district - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: సాధారణంగా పాములు ఏ తుప్పల్లోనో పొలం గట్టులపైనో కనిపిస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఇళ్లలో, బాత్‌ రూం, షూలలో కూడా ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఓ బైకులో పాము కలకలం రేపింది. చిన్నమండెం మండలం బోనమల ఎంపీటీసీ వెంకటప్పనాయుడు పని నిమిత్తం బైక్‌లో మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చాడు.

వాహనాన్ని ఆవరణలో నిలబెట్టి లోపలికి వెళ్లాడు. బయటకు వచ్చిన ఆయనతో స్థానికులు బైక్‌లో పాము దూరిందని ఆయనకు తెలియజేశారు. సీటు తీసి పరిశీలించగా పాము కనిపించలేదు. వాహనాన్ని స్టార్ట్‌ చేసి పక్కన వేచి ఉండగా శబ్దానికి బైక్‌లో నుంచి పాము బుసలు కొట్టుకుంటూ బయటకు వచ్చింది. దీంతో స్థానికులు దానిని కొట్టి చంపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement