Minister Peddireddy and Mithun Reddy Are Safe in Car Accident - Sakshi
Sakshi News home page

మంత్రి పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

Published Mon, Jan 16 2023 2:25 PM | Last Updated on Mon, Jan 16 2023 3:36 PM

Minister Peddireddy And Mithun Reddy Are Safe In Car Accident - Sakshi

సాక్షి, అన్నమమ్య: మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. సంక్రాంతి పండుగ వేళ బంధువుల ఇంటికి మంత్రి పెద్దిరెడ్డి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోని వాహనాన్ని ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. 

వివరాల ప్రకారం.. రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్‌ రోడ్డు వద్ద మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డిలకు తృటిలో ప్రమాదం తప్పింది. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిల కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుంగనూరు నుండి వీరబల్లిలోని అత్తగారి ఇంటికి వెళ్తుండగా మార్గ మద్యంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వచ్చిన ఓ కారు మిథున్‌ రెడ్డికి చెందిన కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆ కారు పల్టీలు కొట్టి కిందపడిపోయింది. 

కాగా, ప్రమాద సమయంలో మంత్రి పెద్దిరెడ్డి కారులో మిథున్‌ రెడ్డి ఉండటంతో ప్రమాదం తప్పింది. ఇక, ఈ ప్రమాదంలో మిథున్‌ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement