అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | 5 Dead, Others Injured In Road Accident At Annamayya District Updates | Sakshi
Sakshi News home page

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తిరుమల దర్శనం ముగించుకుని వెళ్తుండగా..

Published Fri, Sep 15 2023 7:29 AM | Last Updated on Fri, Sep 15 2023 10:17 AM

Road Accident In Annamayya District Updates - Sakshi

సాక్షి, అన్నమయ్య: ఘోర ప్రమాదంతో జిల్లాలో రోడ్డు నెత్తురోడింది. తిరుమల నుంచి ఇంటికి వెళ్తున్న భక్తుల వాహనం.. లారీతో ఢీ కొట్టింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. కొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారు ఝామున పీలేరు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. మృతులు.. బాధితులను కర్ణాటక వాసులుగా పోలీసులు నిర్ధారించారు.

కర్ణాటక బెల్గాం జిల్లా అత్తిని మండలం బడచిగ్రామానికి చెందిన 14 మంది.. తిరుమల దర్శనం కోసం ఓ తుఫాన్‌ వాహనంలో వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా.. తెల్లవారు మూడు గంటల సమయంలో మఠంపల్లి క్రాస్(కె.వి పల్లి మండలం) వద్ద వాళ్ల వాహనాన్ని లారీ ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని తొలుత పీలేరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement