toofan vehicle
-
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, అన్నమయ్య: ఘోర ప్రమాదంతో జిల్లాలో రోడ్డు నెత్తురోడింది. తిరుమల నుంచి ఇంటికి వెళ్తున్న భక్తుల వాహనం.. లారీతో ఢీ కొట్టింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. కొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారు ఝామున పీలేరు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. మృతులు.. బాధితులను కర్ణాటక వాసులుగా పోలీసులు నిర్ధారించారు. కర్ణాటక బెల్గాం జిల్లా అత్తిని మండలం బడచిగ్రామానికి చెందిన 14 మంది.. తిరుమల దర్శనం కోసం ఓ తుఫాన్ వాహనంలో వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా.. తెల్లవారు మూడు గంటల సమయంలో మఠంపల్లి క్రాస్(కె.వి పల్లి మండలం) వద్ద వాళ్ల వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని తొలుత పీలేరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. -
బోల్తా కొట్టిన తుఫాన్.. పెళ్లి కుమార్తె క్షేమం
ప్రకాశం, అద్దంకి: పెళ్లి బృందం ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అద్దంకి–నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిలోని కొంగపాడు డొంక వద్ద గురువారం జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచికి చెందిన పెనుమాక వెంకటేశ్వరరావు కుటుంబానికి చెందిన పెళ్లి బృందం 11 మంది తుఫాన్ వాహనంలో తిరుపతి వెళ్లారు. అక్కడ వివాహం చేసుకుని గురువారం తెల్లవారు జామున తిరుపతి నుంచి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ వాహనానికి చిన్నం వెంకట వీరాంజనేయులు డ్రైవర్గా వెళ్లాడు. ఈ క్రమంలో వాహనం అద్దంకి మండలం కొంగపాడు డొంక సమీపంలోకి రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. డ్రైవర్కు చేయి విరిగింది. ఎస్ఐ సుబ్బరాజు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. డ్రైవర్ నిద్రమత్తే కారణం నిరంతర ప్రయాణంతో డ్రైవర్కు నిద్రలేదు. తెల్లవారు జాము కావడంతో ఆయన నిద్రమత్తులోకి జారుకున్నాడు. ఫలితంగా వాహనం అదుపు తప్పింది. ఏది ఏమైనా పెను ప్రమాదం తప్పి బృంద సభ్యులు స్వల్ప గాయాలతో బయట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
పెళ్లి వాహనం బోల్తా.. నలుగురికి తీవ్రగాయాలు
అద్దంకి(ప్రకాశం): పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన పెళ్లి బృందం తుఫాన్ వాహనంలో తాళ్లూరు వెళ్తుండగా అద్దంకి-నార్కెట్పల్లి రాహదారిలోని చిన్నకొత్తపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు జరగుతుండటంతో పోలీసులు ఖాళీ టైర్ల సాయంతో వేగ నిరరోధకాలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నుంచి వస్తున్న తుఫాన్ వాహన డ్రైవర్ అది గుర్తించకుండా.. టైర్లను ఢీకొట్టాడు. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది. ఈ ప్రమాదంలో పెళ్లికూతురు తల్లిదండ్రులతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని 108 సాయంతో అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉందగా.. జిల్లాలోని సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద పైపుల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. -
వాహనం కింద పడి బాలుడి మృతి
కుల్కచర్ల: రంగారెడ్డి జిల్లాలో శనివారం ఓ బాలుడు మృతిచెందాడు. కుల్కచర్ల మండలం ఘన్పూర్ గ్రామంలో తుఫాను వాహనం కింద పడి శివానంద్(2) ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి ఆవరణలో ఉన్న తుఫాను వాహనం ముందు చిన్నారి ఆడుకుంటున్నాడు. ఇది గమనించని అతడి పెద్దనాన్న రాములు తుఫాను వాహనాన్ని ముందుకు నడిపాడు. దీంతో శివానంద్ వాహనం టైర్ కిందపడి మరణించాడు. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
వాహనం బోల్తా పడి ఒకరి మృతి
సంతమాగులూరు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి వద్ద తుఫాను వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు జరిగిన ఈ సంఘటనలో మేరీ(29) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ రగాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. దొనకొండ నుంచి గుణదల వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.